Vengsarkar coments : తాను సెలెక్టర్‌గా ఉంటే.. కచ్చితంగా అతడిని జట్టులోకి తెచ్చేవాడిని.. హాట్ కామెంట్స్ చేసిన మాజీ ప్లేయర్..
Dilip Vengsarkar coments : మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్ చేసిన కామెంట్స్ హాట్ టాఫిక్‌గా మారుతున్నాయి. తాను ఇప్పుడు ఛీఫ్ సెలక్టర్ స్థానంలో ఉంటే
Dilip Vengsarkar coments : మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్ చేసిన కామెంట్స్ హాట్ టాఫిక్‌గా మారుతున్నాయి. తాను ఇప్పుడు ఛీఫ్ సెలక్టర్ స్థానంలో ఉంటే వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పరిమిత క్రికెట్ మ్యాచ్‌ల్లోకి తీసుకువచ్చేవాడినన్నారు. మొన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, కృనాల్ పాండ్య పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. వీరిని ఉద్దేశించి వెంగ్ సర్కార్ కామెంట్ చేసినట్లుగా అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, కృనాల్ పాండ్య పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.
ఇద్దరూ 16 ఓవర్లలో మొత్తం 156 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. కుల్‌దీప్ పై సోషల్ మీడియా కేంద్రంగా పెద్ద రచ్చే జరుగుతోంది. ఇప్పటికే అతడిని జట్టులో ఉంచాలా లేదా అనేదానిపై చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంగ్ సర్కార్ మాట్లాడిన మాటలకు అందరు మద్దతు తెలుపుతున్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ఫాం లో ఉన్నాడని జట్టుకు అతడి సేవలు అవసరమని వెంగసర్కార్ చెప్పాడు. ఎందుకంటే అతడెంతో అనుభవమున్న బౌలరని.. తన బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని.. అందుకే తాను అతడికి మద్ధతు తెలుపుతున్నానని ప్రకటించాడు.