AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: టీమిండియాకు కలిసొచ్చిన పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీలో మరింత ముందుకు..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ ఓటమితో టీమిండియా లాభపడింది. 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా టీం పాక్‌ను ఓడించి, టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో పాటే డబ్ల్యూటీసీలో అగ్రస్థానాన్ని..

WTC Points Table: టీమిండియాకు కలిసొచ్చిన పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీలో మరింత ముందుకు..
Icc World Test Championship Team India
Venkata Chari
|

Updated on: Mar 25, 2022 | 6:48 PM

Share

Pakistan Vs Australia 3rd Test: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(ICC World Test Championship)లో ఫైనల్‌లో స్థానం కోసం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ జట్ల మధ్య పోటీ కొనసాగుతోంది. ప్రతి టెస్ట్ మ్యాచ్ ఫలితంతో పరిస్థితి మారుతోంది. అందుకే అన్ని టీంలు విజయం కోసం ఎంతగానో కష్టపడుతున్నాయి. అయితే తాజాగా ముగిసిన పాకిస్తాన్ -ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌తో మరోసారి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి. ఇది భారత క్రికెట్ జట్టుతోపాటు అభిమానులకు కొంత ఆనందాన్ని కలిగించింది. లాహోర్‌లో జరిగిన మూడో టెస్టులో చివరి రోజున అంటే శుక్రవారం మార్చి 25న, ఆస్ట్రేలియా ఆతిథ్య పాకిస్థాన్‌ను 115 పరుగుల తేడాతో ఓడించింది. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కేవలం మ్యాచ్ లేదా సిరీస్‌ను గెలవడమే కాకుండా, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన పాయింట్లను కూడా సాధించింది. WTC పాయింట్ల పట్టిక(ICC WTC Points Table)లో మొదటి స్థానంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది . అదే సమయంలో భారత్(Team India) కూడా లాభపడింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకుంది. అదే సమయంలో టీమ్ ఇండియా ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది.

Pak Vs Aus Test Series

మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా విధించిన 351 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పాకిస్తాన్ జట్టు కేవలం 235 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా తరపున ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ 5 వికెట్లు, కెప్టెన్ పాట్ కమిన్స్ 3 వికెట్లు తీశారు. కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తలో 1 వికెట్ పడగొట్టారు.

Also Read: Pak vs Aus 3rd Test: టెస్ట్ సిరీస్ ఆసీస్ సొంతం.. 115 పరుగుల తేడాతో పాక్ ఓటమి.. 24 ఏళ్ల తర్వాత కంగారుల స్పెషల్ రికార్డ్..

Women’s IPL: మహిళల ఐపీఎల్‌పై కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచే షురూ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ..!