IND-W vs AUS-W : రికార్డుల్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం.. టాస్ ఓడిన టీమిండియా..ఈ మ్యాచ్ గెలవాలంటే ఇలా చేయాల్సిందే
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా ఆతిథ్య భారత మహిళల జట్టు తన నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టు అయిన ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడుతోంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

IND-W vs AUS-W : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లో భాగంగా ఆతిథ్య భారత మహిళల జట్టు తన నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టు అయిన ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడుతోంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక, పాకిస్థాన్‌లపై విజయం సాధించినా, గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. కాబట్టి, టోర్నీలో తిరిగి విజయాల బాట పట్టాలంటే, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం భారత్‌కు ఒక పెద్ద సవాల్.
2025 మహిళా వన్డే ప్రపంచ కప్‌లో ఆతిథ్య జట్టు భారత్, తన నాలుగో మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంటోంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో… హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియాకు తొలి సవాల్ ఎదురైంది. శ్రీలంక, పాకిస్థాన్‌లపై గెలిచి టోర్నీని బాగానే ప్రారంభించిన భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో విజయం ట్రాక్‌లోకి రావాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.
ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న 13వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. భారత జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టుతోనే ఆస్ట్రేలియాను ఢీకొడుతోంది.
మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 59 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఆస్ట్రేలియా 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ కేవలం 11 సార్లు మాత్రమే గెలిచింది. ప్రపంచ కప్ చరిత్రలో అయితే, ఈ రెండు జట్లు 13 సార్లు ముఖాముఖి తలపడగా… ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో గెలిచింది, భారత్ కేవలం 3 మ్యాచ్‌లలోనే గెలిచింది. ఈ గణాంకాలు ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి.
Alyssa Healy has won the toss & Australia will bowl first 🏏
Australia – Sophie Molineux comes in for Georgia Wareham.India – Unchanged playing XI
Catch the LIVE action ➡️https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/1EJLpAIEOP
— Star Sports (@StarSportsIndia) October 12, 2025
జట్ల వివరాలు (ప్లేయింగ్ ఎలెవన్)
భారత జట్టు :
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
ఆస్ట్రేలియా జట్టు :
అలిస్సా హీలీ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్, తహ్లియా మెక్‌గ్రాత్, కిమ్ గార్త్, అలానా కింగ్, మేగన్ షూట్, సోఫీ మోలినెక్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




