Video: కెమెరాకు అడ్డంగా బుక్కయిన సూర్య.. డగౌట్‌లో ఏం చేస్తున్నాడో తెలుసా? వీడియో చూస్తే నవ్వాల్సిందే..
Suryakumar Yadav Funny Video: ఈ ఘటన భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో కనిపించింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తూ జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో చోటుచేసుకుంది. కొంత సమయం కెమెరా జట్టు డగౌట్‌లో కూర్చున్న మిగిలిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. చాలా మంది ఆటగాళ్లు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. ఇంతలో సూర్య..

Suryakumar Yadav Funny Video: భారతదేశం (Team India) ప్రపంచ కప్ (ICC World Cup 2023)లో తన ప్రచారాన్ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో (IND vs AUS) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయంతో టోర్నీని ప్రారంభించింది. అయితే, టీమిండియా ప్లేయింగ్ 11లో సూర్యకుమార్ యాదవ్‌కు స్థానం దక్కలేదు. అయితే, అతను డగౌట్‌లో కూర్చున్న సమయంలో చేసిన ఓ చిలిపి పనితో నెట్టింట వైరల్‌గా మారాడు. దీంతో ఈవీడియోపై నెటిజన్లు కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ డగౌట్‌లో కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తున్న వీడియో చూస్తే.. కచ్చితంగా నవ్వుకుంటారు. అయితే, సూర్య స్పందించిన తీరు అందరి మనసులను గెలుచుకుంది.
ఈ ఘటన భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో కనిపించింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తూ జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో చోటుచేసుకుంది. కొంత సమయం కెమెరా జట్టు డగౌట్‌లో కూర్చున్న మిగిలిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. చాలా మంది ఆటగాళ్లు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. ఇంతలో సూర్య చెంచాతో ఏదో తింటున్నాడు. అయితే, వెంటనే కెమెరా తనపై ఫోకస్ చేసిందని గ్రహించాడు. ఆ తర్వాత సూర్య తన నోరు కదపడం ఆపి, కెమెరా ఇంకా తనపై ఉందో లేదో అని పక్కకు చూస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోసల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొతమంది మాత్రం సూర్యను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే.. మిగతా ఆటగాళ్లు తెగ టెన్షన్ పడుతున్న సమయంలో నువ్వు మాత్రం ఇలా తింటున్నావ్ ఏంటి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ వీడియో..
When you have food at a wedding and the cameraman zooms in on you 🥲 pic.twitter.com/hvz7Iu0JmX
— Azhar Jafri (@zhr_jafri) October 9, 2023
ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చలేదని తెలిసిందే. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వగా, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులు మాత్రమే చేసింది.
కౌంటర్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆరంభం అంతగా బాగోలేదు. జట్టు స్కోరు 2 వద్ద మూడు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97*) చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడి అర్ధ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








