AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ సూపర్ విక్టరీ!

లండన్: ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని.. భారత్ 3 వికెట్లు కోల్పోయి 43.3 ఓవర్లలోనే ముగించింది. ఈ క్రమంలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో ఏంజెలో మాథ్యూస్ […]

భారత్ సూపర్ విక్టరీ!
Ravi Kiran
|

Updated on: Jul 07, 2019 | 2:21 AM

Share

లండన్: ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని.. భారత్ 3 వికెట్లు కోల్పోయి 43.3 ఓవర్లలోనే ముగించింది. ఈ క్రమంలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో ఏంజెలో మాథ్యూస్ (113; 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లాహిరు తిరిమన్నె (53; 68 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, హార్దిక్, జడేజా, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఆ తరువాత భారత్ 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. లోకేష్ రాహుల్ ( 111; 118 బంతుల్లో11 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (103; 94 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సెంచరీలతో కదంతొక్కారు. అటు లంక బౌలర్లలో లసిత్ మలింగ, రజిత, ఉదానాలు తలో వికెట్ తీశారు.

వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..