Womens IPL: బీసీసీఐ ఖాతాలో కురిసిన కోట్ల వర్షం.. భారీ ధరకు మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం..

|

Jan 16, 2023 | 2:47 PM

Indian Premier League: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశారు.

Womens IPL: బీసీసీఐ ఖాతాలో కురిసిన కోట్ల వర్షం.. భారీ ధరకు మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం..
Womens Ipl 2023
Follow us on

ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌కు బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. లీగ్ మీడియా హక్కులను సోమవారం ఖరారు చేశారు. వయాకామ్ 18 ఈ లీగ్ మీడియా హక్కులను భారీ బిడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియాలో ప్రకటించారు. వయాకామ్ 18 రూ. 951 కోట్ల బిడ్డింగ్ ద్వారా 2023 నుంచి 2027 వరకు హక్కులను కొనుగోలు చేసింది. అంటే వయాకామ్ 18 ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ.7.09 కోట్లు చెల్లించనుంది.

నిజానికి మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల కోసం వేలంలో బిడ్లు దాఖలయ్యాయి. వచ్చే ఐదేళ్లకు (2023-2027) బీసీసీఐకి రూ.951 కోట్లు ఇవ్వనుంది. మహిళల క్రికెట్‌కు ఇది చారిత్రాత్మకమని జైషా అభివర్ణించారు. మహిళల ఐపీఎల్‌ను మార్చిలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. Viacon 18 తో పాటు, Zee, Sony, Disney Star కూడా ఈ రేసులో పాల్గొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..