Women IPL 2023: మహిళల ఐపీఎల్ టోర్నమెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని బోర్డు యోచిస్తోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా కొద్ది నెలల క్రితమే ప్రకటించారు.

Women IPL 2023: మహిళల ఐపీఎల్ టోర్నమెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Women's Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2022 | 7:35 AM

ప్రస్తుతం మొత్తం క్రికెట్ ప్రపంచంలో వివిధ టీ20 లీగ్‌ల గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అన్ని దేశాల్లోనూ ఇలాంటి లీగ్‌లు సందడి చేస్తున్నాయి. IPL మీడియా హక్కుల ఒప్పందం ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా T20 లీగ్, UAE లీగ్ గురించి చర్చలు కొనసాగుతున్నాయి. వీటన్నింటి మధ్య మరోసారి మహిళల ఐపీఎల్‌పై ఉత్కంఠ పెరగడంతోపాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా వచ్చే ఏడాదికి విండోను ఫిక్స్ చేసిందని భావిస్తున్నారు.

క్రికెట్ వెబ్‌సైట్ ESPN-క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం, మహిళల IPL మొదటి సీజన్‌కు భారత బోర్డు మార్చి 2023ని సరైన సమయంగా గుర్తించింది. నివేదిక ప్రకారం, BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ 2023 మార్చిలో మొదటిసారిగా మహిళల ఐపీఎల్ నిర్వహించడం దాదాపు ఖాయమని, బోర్డు కూడా దీని కోసం సన్నాహాలు ప్రారంభించిందని చెప్పుకొచ్చారు.

దేశీయ క్యాలెండర్‌లో మార్పులు..

ఇవి కూడా చదవండి

మార్చి నెలలో టోర్నమెంట్‌ను నిర్వహించి, ఆపై పురుషుల ఐపీఎల్‌ నిర్వహించేందుకు ఒక నెల ముందుగానే దేశీయ క్యాలెండర్‌లో మహిళల టోర్నమెంట్‌లను ప్రవేశపెట్టాలని బీసీసీఐ నిర్ణయించడానికి బహుశా ఇదే కారణమని నివేదిక పేర్కొంది. BCCI గత వారం కొత్త దేశీయ సీజన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మహిళల టోర్నమెంట్‌లు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. ఇది ఫిబ్రవరి 2023 వరకు కొనసాగుతుంది.

CWG 2022 తర్వాత మరోసారి చర్చల్లోకి మహిళల IPL ..

గతవారం బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత భారత మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ వంటి టోర్నమెంట్లు అవసరమని, తద్వారా వారు అలాంటి పరిస్థితులకు తమను తాము సిద్ధం చేసుకోవచ్చనే చర్చ మళ్లీ మొదలైంది. దీనికి ముందు కూడా మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని భారత బోర్డుపై నిరంతరం ఒత్తిడి ఉంది. దానిపై బీసీసీఐ మొదట్లో మెతక వైఖరిని అవలంబించింది. అయితే కొన్ని నెలల క్రితం, బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ మహిళల ఐపీఎల్ 2023 నుంచి ప్రారంభం కావచ్చని ప్రకటించారు.

మహిళా ఐపీఎల్‌పై ఉత్కంఠ పెరుగుతోందని మేలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం బోర్డు కార్యదర్శి జైషా అన్నారు. తొలుత 5 లేదా 6 జట్లతో టోర్నమెంట్‌ను ప్రారంభించాలని సూచించాడు.