Jasprit Bumrah Best ODI Spell 2022: భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2022లో పెద్దగా క్రికెట్ ఆడలేదు. అయినా.. క్రికెట్ ప్రపంచంలో తన ముద్రను వదలలేదు. బుమ్రా 2022లో ఐదు వన్డేలు సహా మొత్తం 15 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను దక్షిణాఫ్రికాలో మూడు వన్డేలు, ఇంగ్లాండ్‌లో రెండు వన్డేలు ఆడాడు. ఐదు వన్డేలు మాత్రమే ఆడినప్పటికీ, బుమ్రా ఓ అద్భుతం చేశాడు. ఆ స్పెషల్ ఇన్నింగ్స్ చూసిన విజ్డెన్ కూడా అతనిని ప్రశంసలతో ముంచెత్తింది. విజ్డెన్ ఇంగ్లండ్‌పై బుమ్రా బౌలింగ్‌ను ఈ ఏడాది అత్యుత్తమ వన్డే స్పెల్‌గా ఎంచుకుని, అరుదైన గౌరవాన్ని అందించింది.
జులై 12న ది ఓవల్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై బుమ్రా అద్భుతమైన స్పెల్ సంధించాడు. కేవలం 7.2 ఓవర్లలో మూడు మెయిడిన్లతో మొత్తం 19 పరుగులు మాత్రమే ఇచ్చి, ఆరు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా వన్డే కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. బుమ్రా బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. దీనికి సమాధానంగా రోహిత్ శర్మ 76 పరుగులతో సూపర్ బ్యాటింగ్‌తో భారత్ వికెట్ నష్టపోకుండా 18.4 ఓవర్లలో విజయం సాధించింది.
జులైలో ఇంగ్లండ్ పర్యటనను ముగించిన తర్వాత, బుమ్రాకు దాదాపు ఒక నెల విరామం లభించింది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌తో తిరిగి వచ్చాడు. ఈ సిరీస్‌లో బుమ్రా గాయపడి ఆసియా కప్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ వరకు బుమ్రా ఫిట్‌గా ఉంటాడని భావించారు. కానీ, అది జరగకపోవడంతో ఈ టోర్నీకి కూడా దూరమయ్యాడు. బుమ్రా ఇప్పటికీ భారత జట్టులోకి రాలేకపోయాడు. జనవరి చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌తో అతను తిరిగి వస్తాడని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..