Sanju Samson: RR స్టార్ కి షాక్.. జట్టులోంచి తీసేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్?
సంజూ శాంసన్ కేరళ జట్టును వదిలి తమిళనాడు క్రికెట్ జట్టులో చేరుతాడనే వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. వాయనాడ్‌లోని క్యాంపుకు హాజరుకాకపోవడంతో అతన్ని విజయ్ హజారే ట్రోఫీ జట్టులోకి చేర్చలేదు. కేరళ జట్టుపై అతని నిబద్ధతను గుర్తుచేసుకుంటూ, మిగిలిన మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడని కేసీఏ వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికపై సంజూ శాంసన్ కేరళ జట్టును వదిలి తమిళనాడు క్రికెట్ జట్టులో చేరతాడని వదంతులు వైరల్ అవుతున్నాయి. ఇది అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టు తరపున సంజూని ఎంపిక చేయలేదు, అతను వాయనాడ్ క్యాంప్‌కు హాజరుకాలేదని కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ పరిణామాలు సంజూ కేరళ జట్టును వదిలి వెళ్లిపోతాడని ప్రచారం మొదలైంది. అయితే అతని నిబద్ధత, దేశం, రాష్ట్రం పట్ల ప్రేమ ఎప్పటికీ అతన్ని వేరే జట్టులోకి మారేందుకు వీలు కల్పించదని విశ్వసించవచ్చు. గతంలో కూడా ఐరిష్ జట్టు, పెద్ద ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫర్లు ఇచ్చినా, సంజూ ఒప్పుకోలేదు.
కేరళ జట్టు విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు సంజూని జట్టులో చేర్చే అవకాశాలను పరిశీలిస్తోంది. అతను తన నాయకత్వం, ప్రతిభతో కేరళ క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించాడు.