WI vs IND: దంచికొట్టిన పూరన్‌.. విండీస్‌ చేతిలో మళ్లీ ఓడిన టీమిండియా.. తిలక్‌ పోరాటం వృథా

టెస్టులు, వన్డేల్లో టీమిండియాపై ఓటమి చవిచూసిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌లో మాత్రం చెలరేగి ఆడుతోంది. గయానా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో ఛేజింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 150 పరుగులకే ఆలౌటైంది. ఈసారి కూడా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పెద్ద స్కోరు చేయలేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత బ్యాటర్లు నిరాశపర్చారు

WI vs IND: దంచికొట్టిన పూరన్‌.. విండీస్‌ చేతిలో మళ్లీ ఓడిన టీమిండియా.. తిలక్‌ పోరాటం వృథా
India Vs West Indies

Updated on: Aug 07, 2023 | 12:30 AM

టెస్టులు, వన్డేల్లో టీమిండియాపై ఓటమి చవిచూసిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌లో మాత్రం చెలరేగి ఆడుతోంది. గయానా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో ఛేజింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 150 పరుగులకే ఆలౌటైంది. ఈసారి కూడా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పెద్ద స్కోరు చేయలేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత బ్యాటర్లు నిరాశపర్చారు. అయితే తిలక్ వర్మ తొలి అర్ధ సెంచరీ ఆధారంగా నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఛేదనలో విండీస్‌ తడబడినా పూరన్‌ అర్ధ సెంచరీతో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రొవిడెన్స్ స్టేడియంలో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌ లో విండీస్‌ టెయిలెండర్లు ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో ఒకానొక దశలో 129 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది విండీస్‌. అయితే టెయిలెండర్లు అద్భుతంగా ఆడి విండీస్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. 2016 తర్వాత తొలిసారిగా వెస్టిండీస్ వరుసగా 2 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాను ఓడించడం గమనార్హం. కాగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటర్లు నిరాశపర్చారు. ముఖ్యంగా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మళ్లీ 10 పరుగులను కూడా దాటలేకపోయాడు. ఈసారి మూడో ఓవర్ లోనే పెవిలియన్ బాట పట్టాడు. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. తద్వారా తన తన 50వ టీ20 మ్యాచ్‌లో ఒక పరుగుకే పెవిలియన్‌ చేరుకున్నాడు.

తడబడిన టీమిండియా బ్యాటర్లు..

ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్‌లో సగం ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు. అయితే వేగంగా పరుగులు చేయలేకపోయారు. అలాగే పెద్ద స్కోరుకూడా చేయలేకపోయాడు. అతను 10వ ఓవర్లో రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించి స్టంప్ ఔటయ్యాడు. ఇక తిలక్ వర్మ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడు. చివరి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ భారత్ తరఫున అత్యధికంగా 39 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయలేకపోయిన అతను ఈసారి 50 మార్కును దాటి జట్టును 100 పరుగులు దాటించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు సిక్సర్లు బాదినా అతను కూడా చివరి వరకు నిలువలేక పోవడంతో జట్టు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక విండీస్‌ ఇన్నింగ్స్‌ లో నికోలస్‌ పూరన్‌ (40 బంతుల్లో 67) ధాటిగా ఆడాడు. అతని ఇన్నింగ్స్‌ లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..