Super Over Rules: శ్రీలంక వర్సెస్ టీమిండియా (SL vs IND) మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 230/8 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా ఉండడంతో మ్యాచ్ సమమైంది. స్కోర్లు సమం అయిన తర్వాత రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న చాలా మంది అభిమానుల మదిలో మెదులుతోంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ మ్యాచ్‌లో స్కోర్లు సమమైతే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైగా ముగుస్తుందన్నమాట. అంటే, అప్పుడు సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంటారు. అయితే, ఈ నిబంధన కేవలం వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ నియమం ప్రకారం, రెండు జట్లూ తలో ఓవర్ ఆడుతుంటాయి. ప్రతి జట్టు నుంచి 3-3 బ్యాట్స్‌మెన్స్ మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం పొందుతారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల పేర్లను ఇరు జట్లూ ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. జట్టు తన ప్రత్యర్థి కంటే ఎక్కువ పరుగులు చేసే వరకు సూపర్ ఓవర్ కొనసాగుతుంది.
Things went down to the wire in Colombo as the match ends in a tie!
On to the next one.
Scorecard ▶️ https://t.co/4fYsNEzggf#TeamIndia | #SLvIND pic.twitter.com/yzhxoyaaet
— BCCI (@BCCI) August 2, 2024
వాస్తవానికి, ఐసీసీ నిబంధనల ప్రకారం, టై అయిన ప్రతి టీ20 మ్యాచ్ ఫలితాలను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించడం తప్పనిసరి. కానీ, ODI ఫార్మాట్‌లో, ఈ నియమం ICC టోర్నమెంట్‌లలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో సూపర్ ఓవర్ మూడుసార్లు మాత్రమే జరిగింది. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఈ టైడ్ వన్డే మ్యాచ్‌లో అభిమానులు సూపర్ ఓవర్ చూడకపోవడానికి అసలు కారణం ఇదే.
శ్రీలంక-భారత్‌ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా టై కావడంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో గెలిచిన టీమిండియా 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..