డెబ్యూ మ్యాచ్‌లో కోహ్లీకి చుక్కలు.. కట్ చేస్తే.. ఇప్పుడు టీమిండియాకు ముచ్చెమటలు.. ఈ ప్లేయర్ ఎవరంటే.?
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు.. ఆ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయపడుతున్నారు. ఈ తరుణంలో భారత్ మూలాలు ఉన్న ఓ బ్యాటర్ గురించి మాట్లాడుకుందాం..

గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సఫారీ జట్టు. అనుకున్నట్టుగానే దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కున్నారు. తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేయగా.. ఇక ఇప్పుడు రెండో రోజు మొదటి సెషన్‌లో వికెట్ నష్టపోకుండా 316 పరుగులు చేసింది. ముఖ్యంగా సఫారీ జట్టు ఆల్‌రౌండర్ సెనురాన్ ముత్తుసామి అద్భుతమైన అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం 65 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. దక్షిణాఫ్రికా జట్టుకు భారీ స్కోర్ అందించేలా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ముత్తుసామికి.. భారత్‌తో లింక్ ఉందన్న విషయం మీకు తెలుసా.? అతడి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.
అసలు ఎవరీ ముత్తుసామి.?
ఫిబ్రవరి 22, 1994న డర్బన్‌లో పుట్టాడు ముత్తుసామి. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం భారత్‌కు చెందినవారు. ఇప్పటికీ ముత్తుసామికి చెందిన పలువురు బంధువులు తమిళనాడులోని నాగపట్టణంలో నివాసం ఉంటున్నారు. డర్బన్‌లో స్థానిక, స్కూల్ టోర్నమెంట్లలో అదరగొట్టిన ముత్తుసామి. క్వాజులు-నాతల్ ప్రావిన్స్ తరపున అండర్-11, అండర్-19 లెవెల్స్ ఆడాడు. అలా 2015-16 మధ్య దక్షిణాఫ్రికా తరపున అండర్-19 జట్టులో ఎంపికయ్యాడు. ఇక అదే సమయంలో డాల్ఫిన్స్ జట్టు ఓపెనర్‌గా ముత్తుసామిని బరిలోకి దింపగా.. అత్యధికంగా 181 పరుగులు చేశాడు.
డెబ్యూ టెస్టు మ్యాచ్‌ను టీమిండియా తరపున ఆడాడు ముత్తుసామి. విశాఖపట్నం వేదికగా ఆడిన ముత్తుసామి.. తన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. వన్డేలు, టీ20ల్లో కేశవ్ మహారాజ్ ఉండటంతో ముత్తుసామికి పోటీ ఎక్కువైంది. కానీ టెస్టుల్లో మాత్రం అతడు అటు బంతి, ఇటు బ్యాట్‌తో అదరగొడుతున్నాడు.
