AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sam Curran : సీఎస్‌కే నుంచి ఆర్ఆర్‌కు రాగానే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టార్ ప్లేయర్..నీ టైం బాగుంది బాసూ !

ఐపీఎల్ 2026కు ముందు జరిగిన ట్రేడ్ డీల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‎లోకి వచ్చిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. అతను తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ సిమండ్స్కు మోకరిల్లి, సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేయగా ఆమె భావోద్వేగానికి లోనైంది.

Sam Curran : సీఎస్‌కే నుంచి ఆర్ఆర్‌కు రాగానే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టార్ ప్లేయర్..నీ టైం బాగుంది బాసూ !
Sam Curran
Rakesh
|

Updated on: Nov 23, 2025 | 11:29 AM

Share

Sam Curran : ఐపీఎల్ 2026కు ముందు జరిగిన ట్రేడ్ డీల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‎లోకి వచ్చిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. అతను తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ సిమండ్స్కు మోకరిల్లి, సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేయగా ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ శుభవార్తను ఈ జంట నవంబర్ 20, 2025న తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ డబుల్ ట్రీట్ రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది.

ఐపీఎల్ 2026 వేలానికి ముందు శామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ట్రేడింగ్ డీల్‌లో భాగంగా తీసుకుంది. గత వేలంలో సీఎస్‌కే అతన్ని కేవలం రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్‌కు ముందు రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరన్‌ను కూడా రాజస్థాన్ రాయల్స్‌కు బదిలీ చేశారు. ఈ కీలకమైన క్రీడా మార్పు జరిగిన కొద్ది రోజులకే కరన్ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం విశేషం. శామ్ కరన్ కాబోయే భార్య ఇసాబెల్లా గతంలో అనేకసార్లు భారత్‌కు వచ్చింది. ముఖ్యంగా, అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు కూడా ఆమె కరన్‌తో కలిసి హాజరయ్యారు.

ఎవరీ ఇసాబెల్లా గ్రేస్?

శామ్ కరన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఇసాబెల్లా గ్రేస్ సిమండ్స్ గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఇసాబెల్లా గ్రేస్ వృత్తిరీత్యా నటి, రచయిత్రి. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ 40 వేలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. శామ్ కరన్, ఇసాబెల్లా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లతో సహా అనేక సందర్భాలలో ఆమె కరన్‌తో కలిసి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు.

శామ్ కరన్ క్రికెట్ కెరీర్ వివరాలు

27 ఏళ్ల శామ్ కరన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్నాడు. అతని ఆల్రౌండర్ ప్రదర్శన ఇంగ్లాండ్‌కు చాలా కీలకం. శామ్ కరన్ ఇప్పటివరకు 24 టెస్టులు, 38 వన్డేలు, 64 టీ20ఐ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను వరుసగా 47, 35, 57 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ 2019 నుంచి ఐపీఎల్‌లో ఉన్నాడు. అతను పంజాబ్ కింగ్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి, 3 సీజన్లు (2020, 2021, 2025) చెన్నై సూపర్ కింగ్స్‌కు, 3 సీజన్లు (2019, 2023, 2024) పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. రాబోయే సీజన్ (ఐపీఎల్ 2026)లో అతను కొత్త జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంక్రాంతి స్పెషల్: వంటరాని వారి కోసం ఇన్స్టంట్ అరిసెల రెసిపీ
సంక్రాంతి స్పెషల్: వంటరాని వారి కోసం ఇన్స్టంట్ అరిసెల రెసిపీ
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?