Asia Cup 2023 Final: పాక్ vs లంక మ్యాచ్ వాష్ ఔట్ అయితే.. భారత్‌తో ఫైనల్ ఆడేది ఎవరు?

శ్రీలంక-భారత్ (SL vs IND) మధ్య సూపర్ 4 నాలుగో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. మొన్న పాకిస్థాన్‌పై 228 పరుగుల భారీ విజయాన్ని సాధించిన భారత జట్టు నిన్న ఆతిథ్య శ్రీలంకను 41 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే శ్రీలంక స్పిన్నర్ల ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్ లొంగిపోయారు. దీంతో భారత్ 213 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు కూడా 172 పరుగులకే ఆలౌటైంది.

Asia Cup 2023 Final: పాక్ vs లంక మ్యాచ్ వాష్ ఔట్ అయితే.. భారత్‌తో ఫైనల్ ఆడేది ఎవరు?
Asia Cup 2023 Final

Updated on: Sep 13, 2023 | 5:02 PM

Asia cup 2023 Final: ఆసియా కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ఇక్కడ టీం ఇండియా ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో గురువారం పాకిస్తాన్, శ్రీలంక వర్చువల్ సెమీఫైనల్ ఆడునున్నాయి.

అయితే, బంగ్లాదేశ్ ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన రెండు సూపర్ ఫోర్ మ్యాచ్‌లలో ఓడిపోయి ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఇప్పుడు భారత్‌లో ఫైనల్లో తలపడబోయే జట్టు ఏదనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కూడిన ఆసియా కప్ సూపర్ 4 దశ పాయింట్ల పట్టిక ఓసారి చూద్దాం..

జట్టు మ్యాచ్‌లు గెలుపు ఓటమి పాయింట్లు నెట్ రన్ రేట్
భారతదేశం (క్వాలిఫై) 2 2 0 4 +2.411
శ్రీలంక 2 1 1 2 +0.199
పాకిస్తాన్ 2 1 1 2 -1.892
బంగ్లాదేశ్ (ఎలిమినేట్) 2 0 2 0 -0.749

శ్రీలంకపై పాకిస్థాన్ గెలిస్తే ఏమవుతుంది?

గురువారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిస్తే నాలుగు పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించి భారత్‌తో ఆడుతుంది.

పాకిస్థాన్‌పై శ్రీలంక గెలిస్తే ఏమవుతుంది?

పాకిస్థాన్‌పై శ్రీలంక గెలిస్తే నాలుగు పాయింట్లతో భారత్‌తో ఫైనల్‌లో తలపడుతుంది.

PAK vs SL మ్యాచ్ వాష్ అవుట్ అయితే పరిస్థితి ఏంటి?

ఒకవేళ పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ వాష్ అవుట్ అయితే, నెట్ రన్ రేట్ అధికంగా ఉండటం వల్ల శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత్‌పై పాకిస్థాన్ 228 పరుగుల తేడాతో ఓడిపోవడంతో దాని నెట్ రన్ రేట్ (NRR) ప్రతికూలంగా మారింది.

ఆసియా కప్ 2023 ఫైనల్ సెప్టెంబర్ 17న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.

లంకపై అద్భుత విజయం..

శ్రీలంక-భారత్ (SL vs IND) మధ్య సూపర్ 4 నాలుగో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. మొన్న పాకిస్థాన్‌పై 228 పరుగుల భారీ విజయాన్ని సాధించిన భారత జట్టు నిన్న ఆతిథ్య శ్రీలంకను 41 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే శ్రీలంక స్పిన్నర్ల ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్ లొంగిపోయారు. దీంతో భారత్ 213 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు కూడా 172 పరుగులకే ఆలౌటైంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. శుభ్‌మన్ గిల్ 19 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 53 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్ పతనం తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..