డెబ్యూ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.. ఆ తర్వాత 7 వికెట్లు తీశాడు.. అతడెవరంటే.?

|

May 26, 2021 | 9:48 AM

దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి మ్యాచ్ ప్రతీ ఆటగాడికి ఓ తీపి గుర్తు. తన కెరీర్ మొదటి మ్యాచ్ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రదర్శన..

డెబ్యూ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.. ఆ తర్వాత 7 వికెట్లు తీశాడు.. అతడెవరంటే.?
Cricket Batting Symbolic
Follow us on

దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి మ్యాచ్ ప్రతీ ఆటగాడికి ఓ తీపి గుర్తు. తన కెరీర్ మొదటి మ్యాచ్ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రదర్శన చేయాలని కోరుకుంటాడు. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. కొందరు మాత్రమే అనుకున్నది సాధిస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్లేయర్.. అతడు తన తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. ఆ ప్లేయర్ పుట్టినరోజు ఈరోజు.. అతడే వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చెందిన జియోఫ్ గ్రీనిడ్జ్. గ్రీనిడ్జ్ 26 మే 1948న బార్బడోస్‌లో జన్మించాడు.

జియోఫ్ గ్రీనిడ్జ్ తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను బార్బడోస్ తరపున ఆడాడు. ఈ మ్యాచ్ 1966-67లో బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగింది. తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో, జియోఫ్ డబుల్ సెంచరీతో దుమ్ముదులిపాడు. అంతేకాకుండా తన లెగ్ స్పిన్‌తో మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత గీనిడ్జ్ బార్బడోస్ తరపున 181 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

వెస్టిండీస్ తరపున ఐదు టెస్టులు ఆడాడు..

వెస్టిండీస్ తరపున గ్రీనిడ్జ్ ఐదు టెస్టులు ఆడాడు. ఇందులో 29.85 సగటుతో 209 పరుగులు చేశాడు. అటు 181 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, 29.39 సగటుతో 16 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలతో 9112 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 205 పరుగులు.

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!