WI vs SA : మొదటి టీ 20 లో ఇరగదీసిన లూయిస్, గేల్..! 15 ఓవర్లలో 15 సిక్స్‌లు.. ఫలితంగా వెస్టీండీస్ ఘన విజయం..
WI vs SA : ఫార్మాట్ మారిన వెంటనే వెస్టిండీస్ శైలి, మానసిక స్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో
WI vs SA : ఫార్మాట్ మారిన వెంటనే వెస్టిండీస్ శైలి, మానసిక స్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. 5 టి 20 ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున రాసి వాన్ దార్ డుసెన్ 38 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇది కాకుండా వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ క్వింటన్ డి కాక్ 37 పరుగులు చేసి జట్టులో రెండో ఉత్తమ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు ఆతిథ్య కరేబియన్‌కు 161 పరుగుల లక్ష్యం ఉంది. అయితే ఊహించిన విధంగా ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ సులభంగా సాధించింది.
7 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యం వెస్టిండీస్ తరఫున ఎవిన్ లూయిస్, ఆండ్రీ ఫ్లెచర్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓపెనర్లు ఇద్దరూ బాగానే ఆడారు. తొలి 7 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జంటను ఏ ఆఫ్రికన్ బౌలర్ ఔట్ చేయలేకపోయాడు. కానీ దురదృష్ట్య వశాత్తు ఫ్లెచర్ రనౌట్ చేత ఈ జంట విడిపోయింది. అయితే దక్షిణాఫ్రికాకు అసలు ప్రమాదం ఇప్పుడే ముంచుకొచ్చింది.
లూయిస్, గేల్‌ల విజృంభన ఫ్లెచర్ వెళ్ళిపోవడంతో గేల్, లూయిస్‌కు జత కలిసాడు. ఎవిన్ లూయిస్ దాడి మరింత డేంజర్‌గా మారింది. మరోవైపు గేల్ కూడా విజృభించడం మొదలెట్టాడు.12 వ ఓవర్లో వెస్టిండీస్ స్కోరు బోర్డు నూట యాభై పరుగులకు చేరుకుంది. ఇందులో ఎవిన్ లూయిస్ 35 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ 202.85 స్ట్రైక్ రేటుతో కొనసాగింది. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
15 ఓవర్లు, 15 సిక్సర్లు, గేమ్ ఓవర్ ఎవిన్ లూయిస్ అవుట్ కావడంతో క్రీజులోకి రస్సెల్ వచ్చాడు. గేల్, రస్సెల్ కలిసి మిగతా పని ముగించారు. గేల్ 24 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేయగా, రస్సెల్ 12 బంతుల్లో అజేయంగా 23 పరుగులు చేశాడు. వెస్టిండీస్ 15 ఓవర్లలో 20 ఓవర్ల లక్ష్యాన్ని ఛేధించింది. ఇంకా 30 బంతులు మిగిలి ఉండగానే విజయం ఖరారైంది. కరేబియన్ జట్టు 15 ఓవర్లలో మొత్తం 15 సిక్సర్లు కొట్టింది. ఇందులో లూయిస్ నుంచి 7 సిక్సర్లు ఉన్నాయి. రస్సెల్, గేల్ 3-3 సిక్సర్లు, ఫ్లెచర్ 2 సిక్సర్లతో అదరగొట్టారు.