AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs ENGW 1st ODI Preview: ఇంగ్లండ్‌తో భారత మహిళల పోరు; నేడు బ్రిస్టల్‌ మొదటి వన్డే

స్నేహ రాణా, తానియా భాటియా, షెఫాలి వర్మ లు ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో చిరస్మరణీయమైన ప్రదర్శనతో టీమిండియాను డ్రాతో గట్టేక్కించేలా కీలకపాత్ర పోషించారు.

INDW vs ENGW 1st ODI Preview: ఇంగ్లండ్‌తో భారత మహిళల పోరు; నేడు బ్రిస్టల్‌ మొదటి వన్డే
Indw Vs Engw 1st Odi
Venkata Chari
|

Updated on: Jun 27, 2021 | 10:56 AM

Share

INDW vs ENGW: స్నేహ రాణా, తానియా భాటియా, షెఫాలి వర్మ లు ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో చిరస్మరణీయమైన ప్రదర్శనతో టీమిండియాను డ్రాతో గట్టేక్కించేలా కీలకపాత్ర పోషించారు. దీంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు నేటినుంచి మొదలు కానున్న వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(ఆదివారం, జూన్ 27న) మొదటి వన్డే జరగనుంది. అయితే వచ్చే ఏడాది జరగబోయే మహిళల వన్డే ప్రపంచ కప్‌కు మందు ఆటగాళ్లను పరీక్షించబోతోంది. ఈ సిరీస్‌లో రాణించి బెర్తులు ఖాయం చేసుకోవడానికి ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డ, టీ20 సిరీస్‌ల్లో భారత్ జట్టు ఓడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ తో ఎలా ఆడబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, స్మృతి మంధనా మెరుగైన స్ట్రైక్ రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. మంచి ఆరంభాలను అందిస్తోంది. కానీ, స్మృతి పెవిలియన్ చేరాక వన్‌డైన్‌తో పాటు మిడిలార్డర్‌ పరుగులు సాధించేందుకు తెగ కష్టపడుతున్నారు. వేగంగా పరుగులు సాధించడంలో విఫలమవుతున్నారు. దీంతో టీమిండియా మహిళలు 250 స్కోర్‌ను సాధించలేకపోతున్నారు.

అయితే షెఫాలి వర్మకు ప్రస్తుత వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఏకైక టెస్టులు అదరగొట్టిన షెఫాలీ.. వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని ఎదరుచూస్తోంది. ఆమె క్రీజులో 15 ఓవర్లు నిలదొక్కుకుందంటే చాలు.. స్కోర్‌ బోర్డులో 70 నుంచి 80 పరుగులు చేరుతాయనడంలో సందేహం లేదు.

ఇక మిడిల్ ఆర్డర్‌లో భారత జట్టు ఆటగాళ్ల పైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పరుగులు వేగంగా సాధించలేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీసే ఇందుకు మంచి ఉదాహరణ. అయితే, వన్డే సిరీస్‌లో ఇరు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్ ఆటగాళ్లకు ఓ చక్కని అవకాశం. ఏడాది జరిగే ప్రపంచ కప్ లో చోటు సంపాధించాలంటే కచ్చితంగా రాణించాలి. లేదంటే బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటోంది. మేనేజ్‌మెంట్ కూడా ఈ సిరీస్‌లో ఆటగాళ్లను నిశితంగా పరిశీలిస్తోంది.

మ్యాచ్‌ ఎప్పుడు: జూన్ 27 (ఆదివారం)

మ్యాచ్ జరిగే సమయం: 3.30 PM IST(భారత కాలమానం ప్రకారం)

లైవ్: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారాలను అందించనుంది. అలాగే డిజిటల్ గా సోనీ ఎల్‌ఐవీ లో ప్రసారం కానుంది.

మీకు తెలుసా?

– దీప్తి శర్మ 1500 వన్డే పరుగుల మైలురాయికి కేవలం 12 పరుగుల దూరంలో ఉంది.

– ఏక్తా బిష్ట్‌ మరో 4 వికెట్లు సాధిస్తే.. 100 వన్డే వికెట్ల క్లబ్‌ లో జాయిన్ కానుంది. దీంతో 100 వికెట్లు సాధించిన నాలుగో భారత బౌలర్‌గా అవతరించనుంది.

ఇండియా స్క్వాడ్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధనా, పునం రౌత్, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలి వర్మ, దీప్తి శర్మ, శిఖా పాండే, పూజ వస్త్రకర్, తానియా భాటియా, ఇంద్రానీ రాయ్, స్నేహ్ అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్.

ఇంగ్లాండ్ స్క్వాడ్: హీథర్ నైట్ (కెప్టెన్), ఎమిలీ అర్లోట్, టామీ బ్యూమాంట్, కేథరీన్ బ్రంట్, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, తాష్ ఫర్రాంట్, సారా గ్లెన్, అమీ జోన్స్, నాట్ సైవర్ (వైస్ కెప్టెన్), అన్య ష్రబ్‌సోల్, మాడి విల్లియర్స్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్ఫీల్డ్-హిల్.

ప్లేయింగ్ లెవన్: ఇండియా: స్మృతి మంధనా, షెఫాలి వర్మ, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, ఇంద్రాణి రాయ్ (కీపర్), పూజ వస్త్రకర్, స్నేహ రానా, జూలాన్ గోస్వామి, శిఖా పాండే.

ఇంగ్లాండ్: టామీ బ్యూమాంట్, సోఫియా డంక్లే, హీథర్ నైట్, నాట్ సైవర్, అమీ జోన్స్ (కీపర్), ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అన్య ష్రబ్‌సోల్, కేథరీన్ బ్రంట్.

Also Read:

WI vs SA : మొదటి టీ 20 లో ఇరగదీసిన లూయిస్, గేల్..! 15 ఓవర్లలో 15 సిక్స్‌లు.. ఫలితంగా వెస్టీండీస్ ఘన విజయం..

ENG vs SL: మలాన్ మాయ.. మూడో టీ20లోనూ ఇంగ్లండ్ ఘన విజయం; సిరీస్‌ క్లీన్‌స్వీప్

Glenn Phillips : 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్..! 5 సిక్సర్లు, 7 ఫోర్లతో అదరగొట్టేశాడు ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్..

World Cup 1983: “ధోనీసేనపై విజయం మాదే.. ప్రపంచకప్‌ను అస్సలు వదులుకోం”: కపిల్‌ డెవిల్స్‌