AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glenn Phillips : 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్..! 5 సిక్సర్లు, 7 ఫోర్లతో అదరగొట్టేశాడు ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్..

Glenn Phillips : అతను వికెట్ కీపర్‌గా క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో స్వచ్ఛమైన బ్యాట్స్‌మన్‌గా ఆడాడు.

Glenn Phillips : 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్..! 5 సిక్సర్లు, 7 ఫోర్లతో అదరగొట్టేశాడు ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్..
Glenn Phillips
uppula Raju
|

Updated on: Jun 26, 2021 | 3:02 PM

Share

Glenn Phillips : అతను వికెట్ కీపర్‌గా క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో స్వచ్ఛమైన బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. ఈ మ్యాచ్ గ్లౌసెస్టర్షైర్ వర్సెస్ సస్సెక్స్ మధ్య జరిగింది. గ్లౌసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మన్ ఫిలిప్స్ సస్సెక్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ మొదటి బ్యాటింగ్ చేసింది. కేవలం 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అప్పుడే గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో అడుగు పెట్టాడు. తర్వాత మైదనాంలో పరుగుల వర్షం కురిపించాడు.

77 నిమిషాలు 58 బంతులు, 94 * పరుగులు 20 ఓవర్ల మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ 58 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేశాడు. అతను సెంచరీకి 6 పరుగుల దూరంలో ఉన్నాడు. 7 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. దీంతో గ్లౌసెస్టర్షైర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. 62.06 స్ట్రైక్ రేట్ వద్ద ఫిలిప్స్ 94 నాటౌట్ గా నిలిచాడు.

వరుసగా రెండోసారి 94 నాటౌట్ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టి 20 బ్లాస్ట్‌లో గ్లెన్ ఫిలిప్స్ వరుసగా రెండోసారి అజేయంగా 94 పరుగులు చేశాడు. జూన్ 24 న, జూన్ 25 కి ముందు, గ్లామోర్గాన్‌పై అజేయంగా 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ బ్రిస్టల్‌లో జరిగింది.

గ్లౌసెస్టర్షైర్ 27 పరుగుల తేడాతో గెలిచింది 163 పరుగులతో బరిలోకి దిగిన సస్సెక్స్ జట్టు ఎక్కడా లక్ష్యం వైపు దూసుకెళ్లిన తీరు కనబడలేదు. అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 7గురు బ్యాట్స్ మెన్ సింగిల్ నెంబర్‌కే పరిమితమయ్యారు. మొత్తం జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది 135 పరుగులకు ఆలౌట్ అయింది.

Rare Pearl Cone: వలకు చిక్కిన అరుదైన ముత్యపు శంఖం.. కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు.. అంత స్పెషలేంటంటే..

భార్య పుట్టింటికి వెళ్లిందని భ‌ర్త‌కు ఆగ్రహం.. మామ, కూతురిపై దాడి.. విధి మాత్రం అత‌డితో ఆడుకుంది

Dy CM Renu Devi Residence: కుండపోత వర్షానికి నీట మునిగిన డిప్యూటీ సీఎం ఇల్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

Hyderabad Cricket Association: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్; మరింత రాజుకున్న వివాదం