Rare Pearl Cone: వలకు చిక్కిన అరుదైన ముత్యపు శంఖం.. కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు.. అంత స్పెషలేంటంటే..

Mutyam Shanku: సముద్రంలో ఎంతో సంపద నిక్షిప్తమై ఉంటుంది. ఎన్నో జీవ చరాలు, మరెన్నో ఖనిజాలు, అంతమైన ముత్యపు చిప్పలు..

Rare Pearl Cone: వలకు చిక్కిన అరుదైన ముత్యపు శంఖం.. కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు.. అంత స్పెషలేంటంటే..
Rare Pearl Cone
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 2:58 PM

Mutyam Shanku: సముద్రంలో ఎంతో సంపద నిక్షిప్తమై ఉంటుంది. ఎన్నో జీవ చరాలు, మరెన్నో ఖనిజాలు, అంతమైన ముత్యపు చిప్పలు, శంఖాలు, రంగు రంగుల రాళ్లు నెలవై ఉంటాయని మనందరికీ తెలిసిందే. ప్రపంచం ఇప్పటి వరకూ చూడని మరెన్నో వింతలు సముద్ర గర్భంలో ఉన్నాంటారు సముద్ర పరిశోధకలు.

ఇదిలాఉంటే.. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రంలో అరుదైన ముత్యపు శంఖం వలకు చిక్కింది. ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు గంటా జగన్నాథం.. ఇవాళ ఉదయం సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపల కోసం వేసిన వలలో అరుదైన ముత్యపు శంఖం చిక్కింది. అది చూసి మత్స్యకారుడు షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని ఇతర మత్సకారులతో పంచుకున్నాడు. అయితే, ఇందులో ముత్యాలు ఉంటాయని దానిని కొనుగోలు చేసేందుకు పలువురు వ్యాపారులు పోటీ పడ్డారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ ముత్యపు శంఖాన్ని అమీనాబాద్ మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద వేలం పాటకు పెట్టారు. ఈ వేలంలో ముత్యపు శంఖానికి రూ. 18 వేలు పలికింది. కాగా, దీనిని తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఓపెన్ చేస్తే ముత్యాలు ఉంటాయని మత్స్యకారుల నమ్మకం. కాగా, ముత్యాలు ఉంటాయనే నమ్మకంతో ఉప్పాడ ప్రాంతానికి చెందిన నలుగురు మత్స్యకారులు కలిసి దీనిని కొనుగోలు చేశారు.

Also read:

Ajith : అజిత్ వలిమై మూవీ నుంచి నో అప్డేట్స్… సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ