World Cup 1983: “ధోనీసేనపై విజయం మాదే.. ప్రపంచకప్‌ను అస్సలు వదులుకోం”: కపిల్‌ డెవిల్స్‌

కపిల్‌దేవ్‌ సారథ్యంలో భారత్ 1983లో తొలి ప్రపంచకప్‌ సాధించి 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనాటి టీంలోని సభ్యులతో ఓ ఛానెల్‌ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది.

World Cup 1983: ధోనీసేనపై విజయం మాదే.. ప్రపంచకప్‌ను అస్సలు వదులుకోం: కపిల్‌ డెవిల్స్‌
Kapil Devils
Follow us

|

Updated on: Jun 26, 2021 | 4:18 PM

World Cup 1983: కపిల్‌దేవ్‌ సారథ్యంలో భారత్ 1983లో తొలి ప్రపంచకప్‌ సాధించి 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనాటి టీంలోని సభ్యులతో ఓ ఛానెల్‌ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాంలో కపిల్స్ డెవిల్స్ సభ్యులు పాల్గొని, ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. మరోసారి టీమిండియా 2011లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను ఓడించి ‎ఐసీసీ వన్డే ట్రోఫీని అందుకుంది. కపిల్‌ తర్వాత భారత్ కు ప్రపంచ కప్‌ అందించిన ఘనత ఎంఎస్ ధోనీకే దక్కుతుంది. అయితే, కపిల్ డెవిల్స్, ధోనీ టీంల మధ్య మ్యాచ్‌ నిర్వహిస్తే ఎవరు గెలుస్తారనే యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఆనాటి లెజెండ్స్ మదన్‌లాల్‌, రోజర్‌ బిన్నీ సమాధానంగా “కచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పారు.

“మా జట్టులో సభ్యులంతా పోరాడే వారే. ప్రపంచకప్‌ను అస్సలు వదులుకునే వాళ్లం కాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఆడేందుకు అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా మేమే గెలిచేవాళ్లం” అని మదన్‌లాల్‌ పేర్కొన్నారు. అలాగే రోజర్‌ బిన్నీ స్పందిస్తూ ‘ ధోనీ సేన, కపిల్ డెవిల్స్ ల మ్యాచ్‌ను లార్డ్స్‌లో నిర్వహిస్తే కచ్చితంగా మేమే గెలిచేవాళ్లం’ అని పేర్కొన్నారు. అనంతరం సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ, తనకు ఇష్టమైన సందర్భాన్ని గుర్తు చేశారు. సెమీఫైనల్స్‌లో భారత్.. ఇంగ్లాండ్‌పై గెలవడం తనకు ఎంతో స్పెషల్ అని తెలిపాడు. ఆ రోజు తన తల్లి పుట్టినరోజని, ఆ మ్యాచ్‌ తాను 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచానని, విజయంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. భారత క్రికెట్‌లోనూ ఈ విజయం ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆనాటి జట్టు. ముఖ్యంగా కపిల్ ఆల్‌రౌండ్ బాధ్యతలతో టీం ను ముందుండి నడిపించి, ఎనలేని కీర్తిని పొందాడు. క్రికెట్‌ను అందరికీ పరిచయం చేసి, నేడు ప్రధాన క్రీడగా అవతరించడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. ఈమేరకు బీసీసీఐ కూడా శుక్రవారం ఆనాటి సంగతులను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. క్రికెట్ ప్రేమికులు కూడా కామెంట్లతో అలనాటి టీంను పొగడ్తలతో ముంచెత్తారు. కపిల్స్ డెవిల్స్ ఆఫ్ 1983 అంటూ సరదాగా ట్వీట్స్ పంచుకున్నారు.

Also Read:

Glenn Phillips : 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్..! 5 సిక్సర్లు, 7 ఫోర్లతో అదరగొట్టేశాడు ఈ 24 ఏళ్ల వికెట్ కీపర్..

Hyderabad Cricket Association: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్; మరింత రాజుకున్న వివాదం

Wimbledon 2021: జకోవిచ్, ఫెదరర్‌ ల పోరు మరోసారి..! వింబుల్డన్‌లో తలపడే అవకాశం

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..