Wimbledon 2021: జకోవిచ్, ఫెదరర్‌ ల పోరు మరోసారి..! వింబుల్డన్‌లో తలపడే అవకాశం

వింబుల్డన్‌లో మరోసారి అభిమానులను కనువిందు చేసేందుకు స్విస్, సెర్జియా స్టార్ ఆటగాళ్లు రెడీ అయ్యారు. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ లు చివరి సారి 2019లో వింబుల్డన్‌ ఫైనల్లో తలపడ్డారు.

Wimbledon 2021: జకోవిచ్, ఫెదరర్‌ ల పోరు మరోసారి..! వింబుల్డన్‌లో తలపడే అవకాశం
Novak Djokovic And Roger Federer Fight Again In Wimbledon
Follow us
Venkata Chari

|

Updated on: Jun 26, 2021 | 12:59 PM

Wimbledon 2021: వింబుల్డన్‌లో మరోసారి అభిమానులను కనువిందు చేసేందుకు స్విస్, సెర్జియా స్టార్ ఆటగాళ్లు రెడీ అయ్యారు. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ లు చివరి సారి 2019లో వింబుల్డన్‌ ఫైనల్లో తలపడ్డారు. 5 సెట్ల పోరులో జకోవిచ్ రెండు మ్యాచ్ పాయింట్లు గెలుచుకుని విజేతగా నిలిచాడు. అయితే, కోవిడ్-19తో గతేడాది జరాగాల్సిన టోర్నీ వాయిదా పడినం సంగతి తెలిసిందే. కాగా, 2021లో జరగనున్న వింబుల్డన్‌లో మరోసారి వీరిద్దరు ఫైనల్‌లో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి వింబుల్డన్‌ ఆరంభం కానుంది.

వింబుల్డన్‌ నిర్వాహకులు శుక్రవారం డ్రా వివరాలను తెలియజేశారు. తొలి రౌండ్లో జకోవిచ్‌.. జాక్‌ డ్రేపర్‌తో తలపడనున్నాడు. అలాగే ఫెదరర్‌ ఫ్రాన్స్‌ ఆటగాడు అడ్రియన్‌ మనారినోతో పోరును మొదలుపెట్టనున్నాడు. వింబుల్డన్‌ ఫైనల్‌ చేరాలంటే డానియెల్‌ మెద్వెదెవ్, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ లాంటి ఆటగాళ్లను ఓడించి ముందుకుసాగాలి. అలాగే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే.. 24వ సీడ్‌ నికోల్జ్‌ బసిలాష్విలితో తొలి రౌండ్లో తలపడనున్నాడు. అయితే జకోవిచ్, ముర్రే లు సెమీస్‌లో పోటీ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నం.3 లో ఉన్న నాదల్, నం.5 లో ఉన్న డొమినిక్‌ థీమ్‌ లు ఈ ఏడాది జరిగే వింబుల్డన్‌ పోటీల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇక మహిళల విభాగంలో 24వ గ్రాండ్‌స్లామ్‌ కోసం పోటీపడనున్న అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌.. తొలి రౌండ్లో 100వ ర్యాంక్‌ లో ఉన్న అలెక్‌జాండ్ర సాస్నోవిచ్‌తో తేల్చుకోనుంది. ఇక క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ ఆష్‌ బార్టీ, అయిదో సీడ్‌ బియాంకా ఆండ్రెస్కూ లతో పోటీ పడే అవకాశం ఉంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సిమోనా హలెప్‌ గాయంతో ఈ ఏడాది పోటీలకు దూరమైంది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్​ ఓపెన్​లోనూ హలెప్‌ పాల్గొనలేదు. అలాగే జపాన్ స్డార్ నవోమీ ఒసాకా సైతం ఈ ఏడాది పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో జరగనున్న ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపంది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్​ నుంచి ఒసాకా అర్థాంతరంగా వైదొలిగింది.

Also Read:

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా స్టార్ షట్లర్ పీవీ సింధు..!

T20 World Cup: అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌; నవంబర్‌ 14న ఫైనల్

ICC Tournaments: ఎంఎస్ ధోనీ నుంచి కేన్‌ విలియమ్సన్‌ వరకు.. 7 ఐసీసీ టోర్నీలలో 7 సార్లు కొత్త విజేతనే!