IND vs BAN: ట్రోఫీ కోసం టీమిండియా వస్తే.. మేం మాత్రం వారిని ఓడించేందుకే వచ్చాం.. బంగ్లా సారథి షాకింగ్ కామెంట్స్..

|

Nov 01, 2022 | 4:19 PM

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య బుధవారం అడిలైడ్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌కి ముందు షకీబ్ అల్ హసన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

IND vs BAN: ట్రోఫీ కోసం టీమిండియా వస్తే.. మేం మాత్రం వారిని ఓడించేందుకే వచ్చాం.. బంగ్లా సారథి షాకింగ్ కామెంట్స్..
Ind Vs Ban
Follow us on

ఒకవైపు టీ20 ప్రపంచకప్‌ను గెలవాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి . టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం కోసం ప్రతి జట్టు చెమటోడ్చుతుంటే.. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాత్రం కీలక స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలవడానికి తమ జట్టు రాలేదని.. కేవలం టీమిండియాను ఓడించేందుకు మాత్రమే వచ్చామని షకీబ్ అల్ హసన్ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కాగా, టీ20 ప్రపంచకప్ గెలవడానికి టీమ్ ఇండియా వచ్చిందని, మా జట్టు కాదని షకీబ్ అల్ హసన్ మీడియా ముందు స్పష్టంగా తేల్చేశాడు.

షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ, ‘మేం ప్రపంచకప్ గెలవడానికి ఇక్కడకు రాలేదు. భారత్ పై గెలవడానికి వచ్చాం. బంగ్లాదేశ్‌ భారత్‌ను ఓడిస్తే చాలు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఈ ప్రకటనతో తీవ్ర చర్చకు దారి తీశాడు. ఈ ఆటగాడు తన జట్టును T20 ప్రపంచ కప్ 2022 గెలవడానికి పోటీదారుగా పరిగణించడం లేదంటూ తేల్చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. పోటీదారులను వదిలేయండి, షకీబ్ తన జట్టును ఛాంపియన్‌గా చేయడానికి కూడా ప్రయత్నించడం లేదంటూ మండిపడుతున్నారు.

పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌ దూకుడు..

సూపర్-12 రౌండ్‌లో బంగ్లాదేశ్ జట్టు మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. గ్రూప్ 2లో మూడో స్థానంలో నిలిచింది. అయితే, సమస్య ఏమిటంటే నెట్ రన్ రేట్ మాత్రం -1.533గా ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఏకపక్షంగా ఓడిపోవడంతో బంగ్లాదేశ్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన తర్వాత బంగ్లాదేశ్ నెదర్లాండ్స్, జింబాబ్వేలను ఓడించింది.

ఇవి కూడా చదవండి

భారత్ పై గెలవడం అంత ఈజీ కాదు..

బంగ్లాదేశ్ జట్టు భారత జట్టును అధిగమించడం అంత సులభం కాదు. భారత్ తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఓడిపోయి ఉండవచ్చు. కానీ, భారత బ్యాటింగ్ యూనిట్ అద్భుత ఫామ్‌లో ఉన్న మాట కూడా నిజం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌కు సూర్యకుమార్ యాదవ్ అతిపెద్ద ముప్పు అని షకీబ్ అల్ హసన్ స్వయంగా అంగీకరించాడు. భారత టీ20లో సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.

ఘోరంగా విఫలమవుతున్న షకీబ్..

టీ 20 ప్రపంచకప్‌లో షకీబ్ అల్ హసన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. బంగ్లాదేశ్ కెప్టెన్ 3 మ్యాచ్‌ల్లో 10.33 సగటుతో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. షకీబ్ స్ట్రైక్ రేట్ కూడా 100 కంటే తక్కువగా నిలిచింది. షకీబ్ బౌలింగ్‌లో కూడా 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 9 పరుగులుగా ఉంది.