WCL Final: అదరగొట్టిన దిగ్గజాలు.. WCL టోర్నీవిజేతగా టీమిండియా.. ఫైనల్లో పాక్‌పై ఘన విజయం

యువరాజ్ సింగ్ నాయకత్వంలో భారత దిగ్గజ ఆటగాళ్లు చెలరేగిపోయారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. శనివారం (జులై 13)న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఛాంపియన్స్ టీమ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్ పై ఘన విజయం సాధించింది.

WCL Final: అదరగొట్టిన దిగ్గజాలు.. WCL టోర్నీవిజేతగా టీమిండియా.. ఫైనల్లో పాక్‌పై ఘన విజయం
Team India

Updated on: Jul 14, 2024 | 6:28 AM

యువరాజ్ సింగ్ నాయకత్వంలో భారత దిగ్గజ ఆటగాళ్లు చెలరేగిపోయారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేశారు. శనివారం (జులై 13)న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఛాంపియన్స్ టీమ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత ఛాంపియన్లు ట్రోఫీపై తమ పేరును నిలబెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌కు 157 పరుగుల టార్గెట్ ను విధించింది. టీమిండియా 19.1 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తద్వారా లీగ్ రౌండ్‌లో పాక్ చేతలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవంతో పాటు ఛాంపియన్ షిప్ టైటిల్ ను టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ తరఫున అంబటి రాయుడు 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. రాబిన్ ఉతప్ప 10 పరుగులు చేశాడు. సురేష్ రైనా 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. గురుకీరత్ మాన్ 34 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. చివర్లో కెప్టెన్ యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లు భారత్‌కు విజయాన్ని అందించారు. ఇర్ఫాన్ విన్నింగ్ షాట్ కొట్టాడు. యువరాజ్ 15 పరుగులు, ఇర్ఫాన్ 5 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో అమిరాన్ యమీన్ 2 వికెట్లు తీశాడు. సయీద్ అజ్మల్, వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో వికెట్ తీశారు.

కాగా, అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున షోయబ్ మాలిక్ అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కమ్రాన్ అక్మల్ 24, మక్సూద్ 21, మిస్బా ఉల్ హక్ 18, సోహైల్ తన్వీర్ 19*, షర్జీల్ ఖాన్ 12 పరుగులు చేశారు. భారత్ తరఫున అనురీత్ సింగ్ 3 వికెట్లు తీశాడు. ఆర్ వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ చెరో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్లేయింగ్ XI:

యూనిస్ ఖాన్ (కెప్టెన్), కమ్రాన్ అక్మల్ (వికెట్ కీపర్), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, అమీర్ యమీన్, సొహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, సొహైల్ ఖాన్.

ఇండియా ఛాంపియన్స్ ప్లేయింగ్ XI:

యువరాజ్ సింగ్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), అంబటి రాయుడు, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, అనురిత్ సింగ్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..