AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VVS Laxman: మరో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ

సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లక్ష్మణ్‌ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీగా ఎంపిక చేశారు. దీని ప్రకారం లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ ఈ సెప్టెంబర్ తో ముగియనుంది. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం లక్ష్మణ్ మరో ఏడాది పాటు అదే పదవిలో కొనసాగనున్నారు

VVS Laxman: మరో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ
VVS Laxman
Basha Shek
|

Updated on: Aug 16, 2024 | 8:10 AM

Share

భారత మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే NCA అధిపతిగా కొనసాగుతున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలాన్ని బీసీసీఐ మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లక్ష్మణ్‌ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీగా ఎంపిక చేశారు. దీని ప్రకారం లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ ఈ సెప్టెంబర్ తో ముగియనుంది. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం లక్ష్మణ్ మరో ఏడాది పాటు అదే పదవిలో కొనసాగనున్నారు.  తన పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించిన VVL లక్ష్మణ్‌కు NCAలోని సీనియర్ భారత కోచింగ్ బృందం సహాయం చేసే అవకాశం ఉంది. దీనికి షితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్ వంటి క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టిన మొదటి మూడు సంవత్సరాలలో క్రీడాకారుల పునరావాసం, శిక్షణ కార్యక్రమాలు, సీనియర్-జూనియర్ జట్లతో మహిళల క్రికెట్‌కు లక్ష్మణ్ గొప్ప రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. వీవీఎస్ లక్ష్మణ్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్ ఆ స్థానంలో ఉన్నారు.

వీవీఎస్ లక్ష్మణ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో టీమిండియా తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 56 అర్ధసెంచరీలు, 17 సెంచరీలతో 45.97 సగటుతో 8781 పరుగులు చేశాడు. అతను ODIలలో 30.76 సగటుతో 10 అర్ధసెంచరీలు, 6 సెంచరీలతో సహా 2338 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను చాలా సందర్భాలలో టీమిండియా ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పని చేస్తోంది. కానీ కొత్త NCA క్యాంపస్ బెంగళూరు శివార్లలో నిర్మించారు. నివేదికల ప్రకారం, ఈ కొత్త NCA క్యాంపస్ కూడా వచ్చే నెలలో ప్రారంభించబడవచ్చు. ఈ కొత్త NCA క్యాంపస్‌లో 3 అంతర్జాతీయ ప్రామాణిక ఫీల్డ్‌లు, 100 పిచ్‌లు, 45 ఇండోర్ పిచ్‌లు, ఒలింపిక్ సైజ్ పూల్ తదితర ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ కొత్త ఎన్‌సీఏ క్యాంపస్‌లో క్రికెటర్లతో పాటు నీరజ్ చోప్రా సహా ఇతర ఒలింపిక్ అథ్లెట్లు కూడా ప్రాక్టీస్ చేయగలరని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..