Virat Kohli: వావ్‌.. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పేసిన కింగ్‌ కోహ్లీ.. వీడియో చూశారా?

బ్యాటింగ్‌లో గోల్డెన్‌ డక్‌ అయిన విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కీలకమైన 17వ ఓవర్‌లో విరాట్ కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌ను ప్రదర్శించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్ 4వ బంతికి కరీం జనత్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్‌ కొట్టాడు. బంతి బౌండరీ లైన్‌ దాటబోతుండగా.. విరాట్ కోహ్లీ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని ఆపగలిగాడు.

Virat Kohli: వావ్‌.. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పేసిన కింగ్‌ కోహ్లీ.. వీడియో చూశారా?
Virat Kohli

Updated on: Jan 18, 2024 | 9:29 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం (జనవరి 17)ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా తరుపున రోహిత్ శర్మ (121) భారీ సెంచరీ సాధించాడు . మిడిలార్డర్‌లో రింకూ సింగ్ (69) ఆకట్టుకునే అర్ధశతకం సాధించి జట్టుకు ఆసరాగా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. 13 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (50), ఇబ్రహీం జద్రాన్ (50) హాఫ్ సెంచరీలకు తోడు మహ్మద్‌ నబీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో మరింత దూకుడుగా ఆడిన గుల్బుద్దీన్ నాయబ్ భారత అభిమానుల్లో గుబులు రేపాడు. అయితే బ్యాటింగ్‌లో గోల్డెన్‌ డక్‌ అయిన విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కీలకమైన 17వ ఓవర్‌లో విరాట్ కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌ను ప్రదర్శించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్ 4వ బంతికి కరీం జనత్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్‌ కొట్టాడు. బంతి బౌండరీ లైన్‌ దాటబోతుండగా.. విరాట్ కోహ్లీ సూపర్‌మ్యాన్‌లా దూకి బంతిని ఆపగలిగాడు. విరాట్ కోహ్లి సిక్స్‌ను ఆపడం ద్వారా 5 పరుగులు ఆదా చేశాడు. కింగ్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ టీమ్ ఇండియాకు వరంగా మారింది. ఎందుకంటే చివరకు అఫ్గానిస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా ముగిసి సూపర్‌ ఓవర్ల దాకా వెళ్లింది.

విరాట్ కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌తో 5 పరుగులను కాపాడుకోకపోతే ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండేది. కానీ విరాట్ కోహ్లి మాత్రం సూపర్బ్‌ ఫీల్డింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 16 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా కూడా 16 పరుగులు చేసి సూపర్ ఓవర్‌ను టై చేసింది. రెండో సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 1 పరుగు చేసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తానికి కోహ్లీ సూపర్బ్‌ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మూడో టీ20 హైలెట్స్..

బిష్ణోయ్ మ్యాజిక్..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..