IND Vs NZ: 109 బంతుల్లో ఒక్క పరుగు చేయలేదు.. ఈ డైనోసర్ బౌలర్ ముందు కోహ్లీ అట్టర్ ఫ్లాప్.. ఎవరో తెల్సా

మరికొద్ది గంటల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు సర్వం సిద్దం కాగా.. అటు న్యూజిలాండ్, ఇటు భారత్ ట్రోఫీ కోసం తహతహలాడుతున్నాయి. మరి ఆ రికార్డులు ఎలా..

IND Vs NZ: 109 బంతుల్లో ఒక్క పరుగు చేయలేదు.. ఈ డైనోసర్ బౌలర్ ముందు కోహ్లీ అట్టర్ ఫ్లాప్.. ఎవరో తెల్సా
Virat Kohli

Updated on: Mar 08, 2025 | 5:23 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియా తరపున అత్యధికంగా 217 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ వచ్చాయి. దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ కీలకం కానున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ పరుగులు సాధించడం అంత సులభం కాదు. దీనికి కారణం లేకపోలేదు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందు విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. వన్డే క్రికెట్‌లో బౌలర్లకు వణుకు పుట్టించే విరాట్.. సాంట్నర్‌ను ఎదుర్కొన్నప్పుడు మాత్రం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుతున్నాడు.

ఇది చదవండి: 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు.. ఫైనల్‌లో టీమిండియాకు శనిలా దాపురించాడు.. ఎవరంటే.?

వన్డేలో విరాట్ vs శాంట్నర్

విరాట్ కోహ్లీ సాంట్నర్ వేసిన 259 బంతులను ఎదుర్కొని 60 సగటుతో 180 పరుగులు చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అతని స్ట్రైక్ రేట్ కేవలం 69 మాత్రమే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాంట్నర్ వేసిన 109 బంతుల్లో విరాట్ ఒక్క పరుగు కూడా చేయలేదు. ఆ బౌలింగ్ విరాట్ డాట్ బాల్స్ ఎక్కువ. సాంట్నర్‌పై కేవలం 5 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు విరాట్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టీమిండియాకి అన్నీ చెడు శకునములే.. ఫైనల్ ఓడితే కోట్లు పాయే.. ఎందుకంటే.?

సాంట్నర్ vs రోహిత్ శర్మ

మరోవైపు, రోహిత్ శర్మ సాంట్నర్ వేసిన 102 బంతులను ఎదుర్కొని 102 పరుగులు చేశాడు. అతని సగటు 51, సాంట్నర్‌పై రెండుసార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో రోహిత్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.

టీమిండియాపై సాంట్నర్ రికార్డు..

భారత్‌పై సాంట్నర్ వన్డే రికార్డు కూడా అద్భుతంగా ఉంది. అతను భారత్‌తో జరిగిన 24 మ్యాచ్‌ల్లో 61.20 సగటు, 77.2 స్ట్రైక్ రేట్‌తో 15 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేటు కేవలం 4.75 మాత్రమే ఉంది. ఫైనల్లో న్యూజిలాండ్‌కు సాంట్నర్ పాత్ర కీలకం కానుంది. భారత బ్యాటర్లు పరుగులు చేయకుండా సాంట్నర్ అడ్డుకుంటే.. న్యూజిలాండ్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి.

ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి