Virat Kohli Rap Song: ‘నయా షేర్’గా విరాట్ కోహ్లీ.. ర్యాప్ సాంగ్ టీజర్‌తో నెట్టింట హల్‌చల్.. వీడియో చూస్తే, స్టెప్పులేయాల్సిందే..
Royal Challengers Bangalore New Rap Song Naya Sher: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ర్యాపింగ్ అంటే చాలా ఇష్టం. అతను సోషల్ మీడియాలో చాలా మంది రాపర్లను కూడా అనుసరిస్తాడు.
RCB New Rap Song Naya Sher: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి చాలా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే వ్యక్తి అని తెలిసిందే. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సీరియస్‌గా కనిపించినా.. బయట మాత్రం అభిమానులకు కావాల్సినంత మజాను అందిస్తుంటాడు. విరాట్ కోహ్లికి పంజాబీ పాటలే కాకుండా ర్యాప్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇదే క్రమంలో కోహ్లీ అభిమానులకు ఓ శుభవార్త అందించాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ త్వరలో తన సొంత ర్యాప్ సాంగ్‌లో కనిపించనున్నాడు.
విరాట్ కోహ్లీకి ర్యాప్ అంటే చాలా ఇష్టం. అతను సోషల్ మీడియాలో దేశంలోని చాలా మంది పెద్ద రాపర్లను కూడా అనుసరిస్తుంటాడు. ఇక ర్యాప్ రియాలిటీ షో ‘హస్టిల్’ చాలా మంది రాపర్లను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక కథనాన్ని కూడా ఉంచాడు. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం రూపొందించిన ర్యాప్ సాంగ్‌లో కనిపించనున్నాడు.
ఆర్‌సీబీ సాంగ్ టీజర్ విడుదల..
View this post on Instagram
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు, ఆర్‌సీబీ కొత్త సాంగ్‌తో ముందుకు వచ్చింది. భారతదేశపు ప్రసిద్ధ రాపర్ డివైన్, గాయని జోనితా గాంధీ ఈ గీతంలో కనిపించనున్నారు. ఆర్‌సీబీ విడుదల చేసిన టీజర్‌లో, ఈ ర్యాప్ సాంగ్‌లో కోహ్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. టీజర్‌ను పంచుకుంటూ “అటెన్షన్ ఎవ్రీ వన్, మీరు ఎదురుచూస్తున్న పదాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీ స్వంత మార్గాన్ని ఎంచుకోవడం, మీ స్వంత ఆట ఆడుకోవడం ఇక మీ వంతు. విరాట్ కోహ్లీ, జోనితా గాంధీలతో గర్జించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ బెంగళూర్ రాసుకొచ్చింది. అభిమానులు ఈ టీజర్‌ను బాగా ఇష్టపడుతున్నారు. పూర్తి పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీజర్ విడుదల సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘నేను ఎప్పుడూ మైదానంలో లేదా వెలుపల పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దగా ఆలోచించని ఆటగాడినే. నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నాను. ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుంటే ఈరోజు ఉన్న స్థితికి చేరేవాడు కాదు. ఈ పాట షూటింగ్ చాలా సరదాగా సాగింది. షూటింగ్ సమయంలో ఎంతో సరదాగా గడిపాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..