Yuvraj Singh Birthday: సిక్సర్ల కింగ్‌కు కెప్టెన్‌ కోహ్లీ స్పెషల్‌ బర్త్‌ డే విషెస్‌.. వీడియో సందేశం పంపి..

|

Dec 12, 2021 | 8:44 PM

యువరాజ్‌ సింగ్.. క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. భారత క్రికెట్‌ జట్టులో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన అతను

Yuvraj Singh Birthday: సిక్సర్ల కింగ్‌కు కెప్టెన్‌ కోహ్లీ స్పెషల్‌ బర్త్‌ డే విషెస్‌.. వీడియో సందేశం పంపి..
Follow us on

యువరాజ్‌ సింగ్.. క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. భారత క్రికెట్‌ జట్టులో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన అతను టీమిండియా రెండు ఐసీసీ ట్రోఫీలు అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2007 వరల్డ్‌ కప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి 12 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో అతను సృష్టించిన విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇక ప్రాణాంతక క్యాన్సర్‌ను ఎదురించి యూవీ సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలా తన అత్యద్భుతమైన ఆటతీరుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ డ్యాషింగ్‌ ఆల్‌రౌండర్ నేడు(డిసెంబర్‌12) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు, నెటిజన్లు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు పంచుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి

కాగా టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ యువరాజ్‌కు ఓ వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా అతనితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘నేను అండర్‌-19 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాలోకి వచ్చాను. అప్పుడు నాకు యువీ ఘనంగా స్వాగతం పలికాడు. నాతో సరదాగా మాట్లాడేవాడు. ఆట పట్టించేవాడు. మా ఇద్దరికీ ఒకే రకమైన ఆహారమంటే ఇష్టం. ఇద్దరికీ ఓకే ఫ్యాషన్‌ సెన్స్‌ ఉంది. అదే విధంగా మా ఇద్దరికీ పంజాబీ సంగీతమంటే కూడా ఇష్టం’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియాకు 19 ఏళ్ల పాటు సేవలందించిన యువరాజ్‌ సింగ్‌ 2019 జూన్‌ 10న అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే అతను ఇటీవల మళ్లీ క్రికెట్‌ బ్యాట్‌ పట్టి పునరాగమనం చేస్తున్నాడన్న రూమర్లు వినిపిస్తున్నాయి.

Rajinikanth Birthday: తలైవాకు తనదైన స్టైల్‌లో బర్త్‌ డే విషెస్‌ చెప్పిన భజ్జీ.. ఏం చేశాడంటే..

Yuvraj Singh: సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌.. అతడి రికార్డులు ఎవరికి సాధ్యం కావు..!

IND Vs SA: ముంబైలో మూడు రోజుల క్వారంటైన్.. 16న జోహన్నెస్‌బర్గ్‎కు ప్రయాణం..