Virat Kohli: బరిలోకి దిగితే.. చితక్కొట్టుడే.. పాకిస్తాన్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించిన రన్ మెషీన్..
Virat Kohli Vs Pakistan: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై చాలా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రపంచకప్‌లలో చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో పాకిస్థాన్‌పై అతని గణాంకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Virat Kohli Vs Pakistan In World Cup: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌లో అక్టోబర్ 15న భారత్-పాకిస్థాన్ మధ్య గ్రేట్ రైవల్రీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతకుముందు, ఆస్ట్రేలియాలో ఆడిన టీ20 వరల్డ్ 2022లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడ్డాయి. ఇందులో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా గెలిచింది.
విరాట్ కోహ్లి ఎప్పుడూ పాకిస్థాన్‌తో తలపడినా.. అది ఏ టోర్నీలో అయినా చితక్కొట్టేస్తాడు. టీ20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక్కడ కింగ్ కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్‌ల సహాయంతో 82 * పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
పాకిస్థాన్‌పై అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడడం ఇదే తొలిసారి కాదు. అతను గత ఐదు ప్రపంచ కప్‌లలో (T20I, ODI ప్రపంచ కప్) పాకిస్తాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాకిస్థాన్‌తో జరిగిన గత 5 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో, కోహ్లీ ప్రతి ఇన్నింగ్స్‌లో 1 సెంచరీతో 350కి పైగా పరుగులు చేశాడు. కోహ్లీ ఈ గణాంకాలను చూస్తుంటే, ఈ ప్రపంచకప్‌లో (2023) మరోసారి విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడగలడనిపిస్తోంది.
పాకిస్థాన్‌తో జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో విరాట్ కోహ్లీ చివరి ఐదు ఇన్నింగ్స్‌లు..
2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 107 పరుగులు.
2016 T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 55*.
2019 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై – 77 పరుగులు.
2021 T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై – 57 పరుగులు.
2022 T20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై – 82* పరుగులు.
2023 ప్రపంచకప్ భారత్‌లో..
ప్రపంచ కప్ 2023 భారతదేశంలోనే జరగనుంది. ఈసారి ప్రపంచకప్ గెలవాలంటే టీమిండియాపై మరింత ఒత్తిడి ఉంటుంది. భారత జట్టు చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత టీ20, వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు నాకౌట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్, 2022 టీ20 ప్రపంచకప్ రెండింటిలోనూ సెమీఫైనల్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..