
Virat Kohli: న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 50వ సెంచరీ. ఈ విధంగా విరాట్ కోహ్లి సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టాడు. సెంచరీ చేసిన తర్వాత, స్టాండ్స్‌లో కూర్చున్న అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దానికి ప్రతిగా అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఆ తర్వాత తన గురువు, హీరో, క్రికెట్ దేవుగు సచిన్‌కు తల వంచిన నమస్కారం చేశాడు. దీంతో ఈ ఆటగాడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇది కాకుండా, సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాగా, విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కింగ్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీని టిమ్ సౌథీ అవుట్ చేశాడు.
అంతకు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ 8.2 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 47 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటయ్యాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 65 బంతుల్లో 79 పరుగులు చేసి రిటైర్డ్‌గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లోనే శ్రేయాస్ అయ్యర్ సెంచరీ మార్కును అందుకున్నాడు.
Sachin Tendulkar hugged Virat Kohli and Congratulating him at Wankhede
Scene Of The WC 😍 Two Goats 🐐#INDvsNZ #ViratKohli𓃵
— VINEETH𓃵🦖 (@sololoveee) November 15, 2023
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
King Kohli celebration 🔥
Anushka Sharma priceless reaction 🥹#ViratKohli𓃵 #ViratKohli #WorldCup2023 #SachinTendulkar pic.twitter.com/nJiqRaym3T— fairy tales (@virat_kohli_3) November 15, 2023
🚨 The best picture you will see on the internet today !#INDvsNZ | #ViratKohli𓃵 pic.twitter.com/46tHi3C1UF
— Haroon 🏏🌠 (@Haroon_HMM) November 15, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..