AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh – Kavya Maran : అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి? కోలీవుడ్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్.. త్వరలోనే ఎంగేజ్మెంట్ ?

Anirudh - Kavya Maran : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తమిళ మీడియాలో ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అనిరుధ్, కావ్యా మారన్ మధ్య సాన్నిహిత్యం ఎప్పటి నుంచో ఉంది.

Anirudh - Kavya Maran : అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి? కోలీవుడ్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్.. త్వరలోనే ఎంగేజ్మెంట్ ?
Anirudh Kaviya Maran
Rakesh
|

Updated on: Mar 28, 2026 | 12:24 PM

Share

Anirudh – Kavya Maran : సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకరు మ్యూజిక్ సెన్సేషన్.. మరొకరు బిజినెస్ సామ్రాజ్యానికి వారసురాలు. ఇప్పుడు వీరిద్దరి చుట్టూ ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తమిళ మీడియాలో ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అనిరుధ్, కావ్యా మారన్ మధ్య సాన్నిహిత్యం ఎప్పటి నుంచో ఉంది. అనిరుధ్ తన కెరీర్‌లో అత్యధిక విజయవంతమైన చిత్రాలను సన్ పిక్చర్స్ బ్యానర్‌లోనే అందించారు. రజనీకాంత్ జైలర్ నుంచి విజయ్ లియో వరకు సన్ నెట్‌వర్క్ నిర్మించిన సినిమాలకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే కావ్యా మారన్ తో అనిరుధ్ కు పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని టాక్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం అనిరుధ్ ప్రత్యేకంగా సాంగ్ కంపోజ్ చేయడం కూడా ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది.

లాస్ వెగాస్ లో షికార్లు.. ఫోటోలు వైరల్

ఈ ఏడాది జూన్ నెలలో అనిరుధ్, కావ్యా మారన్ కలిసి విదేశాల్లో తిరుగుతున్నట్లు కొన్ని ఫోటోలు రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించాయి. వీరు కలిసి లాస్ వెగాస్ వీధుల్లో షికారు చేశారని, కొన్ని ఖరీదైన రెస్టారెంట్లలో డిన్నర్ డేట్‌లకు వెళ్లారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుండి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు రెక్కలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయని, త్వరలోనే నిశ్చితార్థం ఉండబోతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

మీడియా ప్రశ్నలకు అనిరుధ్ సమాధానం ఏంటి?

ఇటీవల ఒక సినిమా వేడుకలో అనిరుధ్ పాల్గొన్నప్పుడు మీడియా ప్రతినిధులు ఆయన పెళ్లి గురించి ప్రశ్నించారు. “అనిరుధ్ గారు, మీ పెళ్లి శుభలేఖ ఎప్పుడు ఇస్తున్నారు?” అని అడగ్గా.. అనిరుధ్ ఒక్క క్షణం ఆగి, నవ్వుతూనే చిన్నపాటి అసహనంతో మళ్లీ ఇదేనా? అని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఈ వార్తలను పూర్తిగా ఖండించకపోవడం, కేవలం దాటవేయడం చూస్తుంటే ఏదో ఉందనే అనుమానాలు ఫ్యాన్స్ లో బలపడుతున్నాయి. మరోవైపు అనిరుధ్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ కెరీర్ పీక్స్ లో ఉన్నారు.

అఫీషియల్ అప్‌డేట్ కోసం ఎదురుచూపులు

ఒకరు తన సంగీతంతో ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిస్ట్.. మరొకరు పవర్‌ఫుల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న మహిళ. వీరిద్దరి కలయిక నిజంగానే జరిగితే అది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద బిగ్ వెడ్డింగ్ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం అనిరుధ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండగా, కావ్యా మారన్ ఐపీఎల్ 2026 సీజన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరి ఈ జంట నిజంగానే పెళ్లి పీటల వరకు వెళ్తుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us