AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: ప్రపంచ కప్‌లో ఏ ఆటగాళ్లు ఆడతారో ఈ సిరీస్‌లో తెలుస్తుంది.. కీలక ప్రకటన చేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్

Ind vs Eng: టీ 20 ప్రపంచ కప్ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో జరగనుంది. దీనికి ముందు భారత్ ఐదు టి 20 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. టి 20 ప్రపంచ కప్‌కు ముందు ఈ సిరీస్ చాలా

India vs England: ప్రపంచ కప్‌లో ఏ ఆటగాళ్లు ఆడతారో ఈ సిరీస్‌లో తెలుస్తుంది.. కీలక ప్రకటన చేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్
VIKRAM RATHOD
Sanjay Kasula
|

Updated on: Mar 10, 2021 | 6:55 AM

Share

India vs England T20 Series: టీ 20 ప్రపంచ కప్ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో జరగనుంది. దీనికి ముందు ఇంగ్లాండ్‌తో టీమిండియా ఆడనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల్లో చాలా కీలకమైనవి.  టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఈ సిరీస్ చాలా ముఖ్యమైనది. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల ఆటతీరును బీసీసీ పరిశీలించనుంది. దీని ద్వారా  ప్రపంచ కప్‌కు ఎంపిక చేస్తారు.

అయితే టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. ఈ సిరీస్ నుంచి ప్రపంచ కప్‌లో ఏ ఆటగాళ్ళు ఆడతారో తేలిపోతుందని అన్నాడు.  ఆట ప్రణాళికను ఆటగాళ్లకు వివరించడమే తన పని అని తెలిపాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్‌లు భారత ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ గురించి పెద్దగా ఆందోళన చెందరని పేర్కొన్నాడు.

సిరీస్ పూర్తయ్యే సమయానికి ప్రపంచ కప్‌కు ఏ ఆటగాళ్ళు సిద్ధంగా ఉంటారో తెలుస్తుంది.  రిషబ్ పంత్ కూడా టీమిండియాకు తిరిగి వచ్చాడు. ఇప్పటి వరకు కెఎల్ రాహుల్ ఒక్కడే ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పంత్ రాకతో రాహుల్ పై మరింత బాధ్యత పెరిగింది. రాహుల్ కీపర్‌గా గొప్ప పని చేసాడు. అతను మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు. అటువంటి పరిస్థితిలో, భవిష్యత్తులో విషయాలు ఎలా పని చేస్తాయో మనం చూడాలి.

గెలిచినంత కాలం సమస్య లేదు

టీమిండియా ఆటగాళ్ల  స్ట్రైక్ రేట్‌కు సంబంధించిన ప్రశ్నపై ఇలా స్పందించాడు.  అయితే టార్గెట్ చేదనలో ఉన్న సమయంలో స్ట్రైక్ రేట్ అర్ధవంతం కాదని అన్నారు. మీరు 10 ఓవర్లలో లేదా 20 ఓవర్లలో అయినా లక్ష్యాన్ని సాధించాలి. మొదటి బ్యాటింగ్ చేసేటప్పుడు  ఈ రేటింగ్ ఖచ్చితంగా  కీలకంగా ఉంటుంది.  అయినా.. ఇప్పుడు జట్టు బ్యాటింగ్ బాగానే ఉంది. మీరు మ్యాచ్ గెలిచినంత కాలం మీ టార్గెట్ పెద్ద కనిపిచదు… ఇలాంటి సమయంలో సమస్యగా ఉండదు.

టి 20 లో బ్యాటింగ్ ప్రణాళిక పరిస్థితిని బట్టి నిర్ణయించబడుతుంది. ఏమి మొదలవుతుంది, ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. అటువంటి పరిస్థితిలో, ఎవరైనా ఎప్పుడైనా బ్యాటింగ్ చేయవచ్చు. ఆటగాళ్లకు అలాంటి మనస్తత్వం అవసరం.

ఇవి కూడా చదవండి

WTC Final Match: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై క్లారిటీ ఇచ్చిన గుంగూలీ.. అక్కడే ఎందుకంటే.. !