Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్‌లో రికార్డుల మోత.. అంబటి రాయుడు రికార్డు అర అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశి

Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశి శుక్రవారం నాడు దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఆతిథ్య యూఏఈ U19 జట్టుపై భారత U19 టీమ్ తరఫున ఆడిన సూర్యవంశి, కేవలం 95 బంతుల్లో 171 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో రికార్డుల వేట మొదలుపెట్టాడు.

Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్‌లో రికార్డుల మోత.. అంబటి రాయుడు రికార్డు అర అడుగు దూరంలో  వైభవ్ సూర్యవంశి
Vaibhav Suryavanshi

Updated on: Dec 12, 2025 | 5:40 PM

Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశి శుక్రవారం నాడు దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. ఆతిథ్య యూఏఈ U19 జట్టుపై భారత U19 టీమ్ తరఫున ఆడిన సూర్యవంశి, కేవలం 95 బంతుల్లో 171 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది.

వైభవ్ సూర్యవంశి తన ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో మొదలుపెట్టాడు. అతను కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన వైభవ్, కేవలం 56 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా వేగం తగ్గించకుండా, మొత్తంగా 84 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌లో అతను 9 ఫోర్లు,14 సిక్స్‌లు కొట్టాడు. చివరకు 95 బంతుల్లో 171 పరుగులు చేసి, ఉద్దిష్ సూరి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఈ 14 ఏళ్ల వండర్ బాయ్, తన 171 పరుగుల ఇన్నింగ్స్‌లో 14 సిక్స్‌లు కొట్టి యూత్ వన్డే చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు 2008లో నమీబియా U19 జట్టుపై 12 సిక్స్‌లు కొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ విలియం హిల్ పేరిట ఉండేది. అంతేకాకుండా, యూత్ వన్డేలలో ఒక భారతీయ ఆటగాడు చేసిన అత్యధిక స్కోరు రికార్డు అయిన అంబటి రాయుడు (177 నాటౌట్) రికార్డును అందుకోవడానికి వైభవ్ కేవలం 6 పరుగుల దూరంలోనే ఆగిపోయాడు.

వైభవ్ సూర్యవంశి ఈ ప్రదర్శనతో కేవలం ప్రపంచ రికార్డులే కాకుండా, అండర్-19 ఏషియా కప్ టోర్నమెంట్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. యూత్ వన్డే చరిత్రలో 50 సిక్స్‌లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఈ ప్రస్తుత అండర్-19 ఆసియా కప్‌లో అతను కేవలం 6 మ్యాచ్‌లలోనే 26 సిక్స్‌లు కొట్టి, గతంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన దర్విష్ రసూలి (22 సిక్స్‌లు) రికార్డును బద్దలు కొట్టాడు. అండర్-19 ఆసియా కప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు (14 సిక్స్‌లు) కొట్టిన రికార్డును కూడా వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి