IND Vs ENG: మళ్లీ బుడ్డోడు వైభవ్ రచ్చ.. ఈసారి పాపం.! ఎరక్కపోయి ఇరుక్కుపోయాడుగా..
భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్ చెల్మ్స్‌ఫోర్డ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేలవ ఆటతీరు కనబరిచాడు. ఎరక్కపోయి.. ఈసారి దొరికిపోయాడు. మరి అదేంటంటే..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌లో భారత అండర్-19 క్రికెట్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ జూలై 20న చెల్మ్స్‌ఫోర్డ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఉండగా.. అతడు తక్కువ పరుగులకే తన వికెట్ కోల్పోయాడు. ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో వైభవ్ తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించాలనుకుని.. తన వికెట్‌ను పోగొట్టుకున్నాడు.
చెల్మ్స్‌ఫోర్డ్ టెస్ట్‌లో రెండవ రోజు, భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కెప్టెన్ ఆయుష్ మహాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వైభవ్ మొదటి బంతి నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. కేవలం 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో మొదటి బంతికి సిక్స్ కొట్టిన వైభవ్.. ఆ తర్వాత కూడా అలాంటి షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
వైభవ్ సూర్యవంశీ అవుట్ కావడంతో భారత జట్టుకు తొలి దశలోనే ఎదురుదెబ్బ తగిలింది. 14 సంవత్సరాల వైభవ్ క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతడు తొలి యూత్ వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. 355 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఒక ఇన్నింగ్స్‌లో అయితే వైభవ్ 52 బంతుల్లో 143 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. కాగా, మొదటి యూత్ టెస్ట్‌లో కూడా వైభవ్ రెండవ ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేశాడు. అంతేకాకుండా రెండు వికెట్లు పడగొట్టాడు. యూత్ టెస్ట్‌లో వికెట్ తీసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




