Vaibhav Suryavanshi : చాలా మారిపోయాడు.. పాత వైభవ్ సూర్యవంశీ కాదు.. కోచ్ మనీష్ ఓఝా సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. అందులో ఒకడైన వైభవ్ సూర్యవంశీ, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఆడేందుకు ఖతార్‌లోని దోహాలో ఉన్నాడు. 14 ఏళ్ల వయసులో ఇండియా-A జట్టుకు సెలక్ట్ అయిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆట తీరులో పెద్ద మార్పు వచ్చిందని అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా అన్నారు.

Vaibhav Suryavanshi : ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. అందులో ఒకడైన వైభవ్ సూర్యవంశీ, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఆడేందుకు ఖతార్‌లోని దోహాలో ఉన్నాడు. 14 ఏళ్ల వయసులో ఇండియా-A జట్టుకు సెలక్ట్ అయిన అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆట తీరులో పెద్ద మార్పు వచ్చిందని అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా అన్నారు. ఈ మార్పు వైభవ్ వ్యక్తిత్వంలో కాకుండా, అతని బ్యాటింగ్ శైలిలో వచ్చిందని కోచ్ మనీష్ ఓఝా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం దోహాలో జరుగుతున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ ఇండియా-A జట్టుకు సెలక్ట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్న అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ కావడం విశేషం. ఈ పెద్ద అవకాశాన్ని వైభవ్ సరిగ్గా ఉపయోగించుకుంటే, భవిష్యత్తులో అతను త్వరగా సీనియర్ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో చిన్ననాటి నుంచి శిక్షణ ఇచ్చిన కోచ్ మనీష్ ఓఝా వైభవ్ ఆటతీరులో వచ్చిన మార్పు గురించి మాట్లాడారు. కొంతకాలం క్రితం పాట్నాలోని మోయిన్-ఉల్-హక్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌ల సమయంలో వైభవ్ సూర్యవంశీని కలిసిన మనీష్ ఓఝా, తన శిష్యుడి బ్యాటింగ్‌లో మూడు ముఖ్యమైన మార్పులను గుర్తించారు.
అనేక పెద్ద టోర్నమెంట్లు, ఫార్మాట్‌లు, లీగ్‌లలో ఆడిన తర్వాత వైభవ్ ఆత్మవిశ్వాసం గతంలో కంటే చాలా పెరిగింది. ఇది అతని బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ గేమ్ సెన్స్ కూడా మెరుగుపడింది. అంటే, వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఆడాలి, వాతావరణానికి, పిచ్‌కి అనుగుణంగా తనను తాను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై అతని అవగాహన బాగా పెరిగింది.
గతంలోలా క్రీజులోకి రాగానే బ్యాట్ ఝుళిపించడం లేదు. ఇప్పుడు వైభవ్ వికెట్‌ను అంచనా వేసి, దానిని పరీక్షించి, ఆ తర్వాతే దానికి అనుగుణంగా షాట్లు ఆడటం మొదలుపెడుతున్నాడు. మనీష్ ఓఝా, వైభవ్ సూర్యవంశీకి చిన్ననాటి కోచ్. అంటే దాదాపు 8-9 సంవత్సరాల వయసు నుంచే శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి వైభవ్ ఆటలోని చిన్న మార్పు కూడా ఆయన గమనించగలరు.
వైభవ్ ఐపీఎల్, ఇండియా అండర్-19 వంటి పెద్ద లీగ్‌లలో ఆడిన తర్వాత ఈ మార్పులు వచ్చాయని కోచ్ చెప్పారు. ఈ మార్పులు వైభవ్ వ్యక్తిత్వంలో కాకుండా, అతని బ్యాటింగ్ శైలిలో వచ్చాయి. ఇది ఒక క్రికెటర్‌కు చాలా మంచి సంకేతం అని మనీష్ ఓఝా అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




