AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: మరోసారి వైభవ్‌ విధ్వంసం..! ఈ సారి కేవలం 15 బంతుల్లోనే..

14 ఏళ్ల వైభవ్ సూర్యవన్షీ తన మెరుపు బ్యాటింగ్‌తో IPLని కుదిపేస్తున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసి అలరించాడు. ఇంతకుముందు 35 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్, యశస్వి జైస్వాల్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు.

IPL 2025: మరోసారి వైభవ్‌ విధ్వంసం..! ఈ సారి కేవలం 15 బంతుల్లోనే..
Vaibhav Suryavanshi
SN Pasha
|

Updated on: May 18, 2025 | 6:14 PM

Share

కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్‌లో ఆడుతూ యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన వైభవ్‌ సూర్యవన్షీ ఐపీఎల్‌ రీస్టార్ట్‌లో కూడా అదరగొట్టాడు. ఐపీఎల్‌ వాయిదా కంటే ముందు కేవలం 35 బంతుల్లో సెంచరీతో చరిత్ర సృష్టించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ రఫ్ఫాడించాడు. కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేసి.. అంతే వేగంగా ఆడే క్రమంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో బ్రాట్‌లెట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. వైభవ్‌ ఉన్నంత సేపు మాత్రం జైపూర్‌ స్టేడియం దడదడలాడింది.

వైభవ్‌తో పాటు మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సైతం మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ బౌలర్లను వణికించాడు. ఇద్దరూ కలిసి పంజాబ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నేహాల్‌ వదేరా 37 బంతుల్లో 70, శశాంక్‌ సింగ్‌ 30 బంతుల్లో 59, చివర్లో అజ్మతుల్లా 9 బంతుల్లో 21 పరుగులు చేయడంతో పంజాబ్‌కు భారీ స్కోర్‌ దక్కింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 30 రన్స్‌ చేసినప్పటికీ 25 బంతులు తీసుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి