AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: చెరో హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ ఆటగాళ్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతో తెలుసా?

ఐపీఎల్ 2025లో ఆదివారం పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ రాజస్తాన్ మధ్య కీలక పోరు జరుగుతుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రాజస్తాన్ ముందు 220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇక పంజాబ్‌ జట్టులో టాప్ ఆర్డర్ కుప్పకూలగా తర్వాత వచ్చిన యువ ఆటగాళ్లు నేహల్ వధేరా, శశాంక్ సింగ్ రెచ్చిపోయారు. చెరో హాఫ్ సెంచరీతో రాజస్థాన్ బౌలర్స్‌పై విరుచుకుపడ్డారు. ఇక ఈ మ్యాచ్‌లో నేహల్ వధేరా (70) పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ (59) పరుగులు చేశాడు.

IPL 2025: చెరో హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ ఆటగాళ్లు.. రాజస్థాన్ టార్గెట్ ఎంతో తెలుసా?
Pbks Vs Rr
Anand T
|

Updated on: May 18, 2025 | 6:09 PM

Share

ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్ కింగ్స్ మధ్య కీలక పోరు జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అయితే పంజాబ్‌ జట్టులో తొలుత ఓపెనర్లుగా వచ్చిన ఆటగాళ్లు పెద్దగా స్కోర్ చేయలేక పోయినా..తర్వాత వచ్చిన యువ ఆటగాళ్లు జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ చెరో హాఫ్ సెంచరీతో రెచ్చిపోవడంతో పంజాబ్ రాజస్తాన్ ముందు భార్యీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అటు రాజస్థాన్ బౌలింగ్ విషయానికొస్తే.. తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీయగా, క్వెనా మఫాక, రియాన్ పరాగ్, ఆకాశ్‌ మధ్వాల్ తలొ వికెట్ తీసుకున్నారు.

ఇక మ్యాచ్‌లో పంజాబ్‌ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన ప్రియాంశ్ ఆర్య 9 పరుగులు, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21) పరుగులతో వెనుతిరిగారు.ఇక తర్వాత వచ్చిన మిచెల్ ఒవెన్ మపాక వేసిన బంతికి (0) డకౌటయ్యాడు. దీంతో పంజాబ్ కేవలం 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక కష్టాల్లో ఉన్న జట్టును తర్వాత వచ్చిన నేహల్, శ్రేయస్ అయ్యర్ ముందుకు తీసుకెళ్లారు. వీరిద్ధరు కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని కొనసాగించిన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ను రియాన్ పరాగ్ వెనక్కి పంపాడు. ఇక అయ్యర్ 25 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక నెమ్మదిగా కదులుతున్న స్కోర్‌ బోర్డును తన దూకుడు ప్రదర్శనతో పైకి తీసుకెళ్లాడు యువ ప్లేయర్ వధేరా. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక దూకుడుగా ఆడుతున్న వధేరా ఆకాశ్‌ మధ్వాల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వధేరా (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు) చేశాడు. ఇక తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ సైతం రాజస్థాన్ బౌలర్స్‌పై విరుచుకు పడ్డాడు. (30 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లతో 59 పరుగులు) చేసి వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కూడా 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 21 పరుగులు చేయగా జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 219 పరుగులకు చేరింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..