AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఆ ‘ఏఐ చిప్’ని దేవుడే నా బ్యాట్‌లో ఫిక్స్ చేశాడు.. పాక్ దిగ్గజానికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న ఈ కుర్రాడి ప్రతిభపై పాకిస్థాన్ విశ్లేషకులు చేసిన వింత వ్యాఖ్యలకు, వైభవ్ తనదైన శైలిలో నవ్వులు పూయించే సమాధానం ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

Video: ఆ 'ఏఐ చిప్'ని దేవుడే నా బ్యాట్‌లో ఫిక్స్ చేశాడు.. పాక్ దిగ్గజానికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
Rr Vs Srh Vaibhav Suryavanshi Half Century
Venkata Chari
|

Updated on: Apr 29, 2026 | 7:12 PM

Share

Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు సాధించి ప్రస్తుతం ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 238.09 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో (167 బంతులు) 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

పాకిస్థాన్ నిపుణుడి వింత విశ్లేషణ..

వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లను చూసి పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌ను చూస్తుంటే అతనిలో ఏదో మ్యాజిక్ ఉందని, బహుశా అతని శరీరంలో లేదా బ్యాట్‌లో ‘కృత్రిమ మేధస్సు’ (ఏఐ) చిప్ అమర్చి ఉండవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. “ఈ అబ్బాయి అసాధారణంగా ఆడుతున్నాడు. డోపింగ్ పరీక్షలు చేసినట్లే, ఇతనిని ఏదైనా ప్రయోగశాలకు పంపి పరీక్షించాలి. బహుశా శరీరంలో ఏఐ చిప్ ఉందేమో” అని నియాజ్ పేర్కొన్నాడు. 18 ఏళ్లు నిండకముందే ఇంతటి శక్తివంతమైన షాట్లు ఆడటం అసాధ్యమని ఆయన కొనియాడాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Punarnava Dal: ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని.. ఎలా వండాలో తెలుసా?

వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే సమాధానం..

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 43 పరుగులు చేసిన తర్వాత, నౌమాన్ నియాజ్ చేసిన ఈ ‘ఏఐ చిప్’ వ్యాఖ్యలపై వైభవ్ స్పందించాడు. దీనికి అతను నవ్వుతూ సమాధానమిస్తూ.. “ఆ చిప్‌ను దేవుడే స్వయంగా నా బ్యాట్‌కు అమర్చి పంపాడు. నేను పుట్టకముందే పైనున్న దేవుడు నా బ్యాట్‌లో ఏదో ఒక శక్తిని పెడుతున్నానని చెప్పాడు, ప్రస్తుతం నేను దాన్నే వాడుతున్నాను” అని బదులిచ్చాడు. ఈ సమాధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Vinod Kambli: కాంబ్లీ ‘కమ్‌బ్యాక్’ ఐస్‌క్రీం యాడ్‌పై దుమారం.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు..!

చరిత్ర సృష్టించిన యువ సంచలనం..

ఈ సీజన్‌లో వైభవ్ కేవలం 167 బంతుల్లోనే 400 పరుగులు పూర్తి చేసి, గతంలో ఆండ్రీ రసెల్ (188 బంతులు), అభిషేక్ శర్మ (195 బంతులు) పేరిట ఉన్న రికార్డులను తిరగరాశాడు. 15 ఏళ్ల వయసులో పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శిస్తున్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఆ AI చిప్‌ని దేవుడే నా బ్యాట్ లో ఫిక్స్ చేశాడు..: వైభవ్ సూర్యవంశీ
ఆ AI చిప్‌ని దేవుడే నా బ్యాట్ లో ఫిక్స్ చేశాడు..: వైభవ్ సూర్యవంశీ
అవి ఇస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
అవి ఇస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి