
Vaibhav Sooryavanshi Target: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీ పేరు అందరి నోట వినిపిస్తోంది. చిన్న వయసులోనే భారీ ఇన్నింగ్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు, గత సీజన్‌లో తన ప్రతిభను నిరూపించాడు. అందుకే ఈసారి అతని ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ రికార్డుతో అతను ఐపీఎల్‌లో వేగవంతమైన శతకం చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతని కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
రాజస్థాన్ రాయల్స్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో, అతడిని ఐపీఎల్ 2026 టార్గెట్ గురించి ప్రశ్నించారు. అందుకు వైభవ్ సరదాగా “అలా అడిగితే 2000-3000 పరుగులు కొడతా” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యపై అక్కడున్న వారంతా నవ్వులు పూయించారు. ఒక సీజన్‌లో ఇన్ని పరుగులు సాధ్యం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే.
తర్వాత వైభవ్ తన అసలు లక్ష్యాన్ని వెల్లడించాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని స్పష్టం చేశాడు. “ప్రాసెస్‌ను ఫాలో అవుతూ జట్టును గెలిపించడం నా ప్రధాన లక్ష్యం” అని చెప్పి తన ప్రొఫెషనల్ దృక్పథాన్ని చూపించాడు.
ఐపీఎల్ 2025లో వైభవ్ 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. అతని సగటు 36 కాగా, స్ట్రైక్ రేట్ 206.55 ఉండటం అతని దూకుడు ఆటను చూపిస్తుంది. అయితే జట్టుకు పూర్తిస్థాయి విజయాన్ని అందించలేకపోయాడు.
ఈసారి ఐపీఎల్‌లో తన జట్టుకు ట్రోఫీ అందించడమే వైభవ్ లక్ష్యం. గత సీజన్‌లో సాధించలేని విజయాన్ని ఈసారి సాధించాలని అతను కసితో ఉన్నాడు. జడేజా వంటి అనుభవజ్ఞులతో కలిసి అతని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
వైభవ్ సూర్యవంశీ సరదాగా చెప్పిన “2000-3000 పరుగులు” కామెంట్ వైరల్ అయినా, అతని అసలు ఫోకస్ మాత్రం జట్టుకు ట్రోఫీ అందించడంపైనే ఉంది. ఈ సీజన్‌లో అతని బ్యాట్ మళ్లీ పరుగుల వర్షం కురిపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..