AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA vs SA: టాస్ గెలిచిన అమెరికా.. సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?

USA vs SA, T20 World Cup 2024: టీ-20 ప్రపంచకప్ 2024లో నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న అమెరికా జట్టు.. తన అద్భుత ప్రదర్శనతో సూపర్ 8 చేరుకుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన అమెరికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

USA vs SA: టాస్ గెలిచిన అమెరికా.. సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?
Sa Vs Usa Toss
Venkata Chari
|

Updated on: Jun 19, 2024 | 7:52 PM

Share

USA vs SA, T20 World Cup 2024: టీ-20 ప్రపంచకప్ 2024లో నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న అమెరికా జట్టు.. తన అద్భుత ప్రదర్శనతో సూపర్ 8 చేరుకుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన అమెరికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మోనాంక్ పటేల్ స్థానంలో ఆరోన్ జోన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

యూఎస్ జట్టు పాకిస్తాన్, కెనడాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తన అన్ని లీగ్ మ్యాచ్‌లను గెలుచుకుంది. క్రికెట్ మైదానంలో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. భుజం గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో అతను జట్టుకు దూరమయ్యాడు.

అమెరికా: షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే, తబ్రైజ్ షమ్సీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..