AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సిద్ధమైన భారత నూతన ఫాస్ట్ బౌలింగ్ సైన్యం.. ఉమ్రాన్ నుంచి ముఖేష్ వరకు.. లిస్టులో ఎంతమంది ఉన్నారంటే?

IPL 2022 సీజన్ ఈ ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు అందించింది. భారతదేశం కొత్త స్పీడ్ స్టార్‌లుగా మారడానికి అన్ని లక్షణాలను కలిగి ఉన్న, భవిష్యత్తులో టీమ్ ఇండియా కోసం ఆడగల ఓ ఐదుగురు వర్ధమాన ఫాస్ట్ బౌలర్ల పేర్లను ఈ రోజు తెలుసుకుందాం..

IPL 2022: సిద్ధమైన భారత నూతన ఫాస్ట్ బౌలింగ్ సైన్యం.. ఉమ్రాన్ నుంచి ముఖేష్ వరకు.. లిస్టులో ఎంతమంది ఉన్నారంటే?
Ipl 2022 Indian Fast Bowlers
Venkata Chari
|

Updated on: May 31, 2022 | 6:56 AM

Share

జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్ల తర్వాత భారత పేస్ బలం ఎలా ఉండనుందోనని అంతా ఆలోచిస్తున్నారు? అయితే, ఈ ప్రశ్న చాలా కాలంగా భారత క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతోంది. IPL 2022 సీజన్ ఈ ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు అందించింది. భారతదేశం కొత్త స్పీడ్ స్టార్‌లుగా మారడానికి అన్ని లక్షణాలను కలిగి ఉన్న, భవిష్యత్తులో టీమ్ ఇండియా కోసం ఆడగల ఓ ఐదుగురు వర్ధమాన ఫాస్ట్ బౌలర్ల పేర్లను ఈ రోజు తెలుసుకుందాం..

జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్..

జమ్మూ ఎక్స్ ప్రెస్ అంటే ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉమ్రాన్ 1970-80లలో కరీబియన్ ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్‌కు వెళుతున్న ఉమ్రాన్‌ను స్లెడ్జ్ చేసినప్పుడు, అతను తన ఫాస్ట్ పేస్ బాల్‌తో తగిన సమాధానం ఇచ్చాడు. గత సీజన్‌లో, జానీ బెయిర్‌స్టో వంటి వెటరన్ బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో నెమ్మదిగా బౌలింగ్ చేయమని ఉమ్రాన్‌ను అభ్యర్థించాడు. పేస్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే ఈ స్పీడ్ స్టార్.. రానున్న కాలంలో టీమ్ ఇండియా పేస్ బౌలింగ్‌కు నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది. ఉమ్రాన్ ఇప్పటికే 157kmph వేగంతో సీజన్‌లో వేగవంతమైన బంతిని బౌలింగ్ చేయడం ద్వారా ప్రపంచ క్రికెట్‌లోని బ్యాట్స్‌మెన్‌లందరినీ అప్రమత్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్‌ను భారత జెర్సీలో చూడటం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

జహీర్, ఇర్ఫాన్‌ల ప్లేస్‌ను భర్తీ చేసే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహ్సిన్..

మొహ్సిన్ ఖాన్ 3 సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ, అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు అవకాశం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఫాస్ట్ బౌలర్ అయినా సంయమనం పాటించడం చాలా కష్టం. మొహసిన్ వేచి ఉన్నాడు. లక్నోలో జరిగిన IPL 2022 మొదటి మ్యాచ్‌లో మోహ్సిన్ సాధారణ ప్రదర్శన తర్వాత జట్టు నుంచి తొలగించారు. కొన్ని మ్యాచ్‌లు బెంచ్‌పై కూర్చున్న తనకు మళ్లీ జట్టులో అవకాశం వచ్చినప్పుడు, మొహ్సిన్ అద్భుతాలు చేశాడు. అతను 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 పరుగులకు నాలుగు వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఐపీఎల్ 2022లో 5.97 ఎకానమీతో పరుగులు అందించిన మొహ్సిన్‌కు టీమ్ ఇండియా తలుపులు ఎక్కువ కాలం మూసుకుపోవని ఇది తెలియజేస్తోంది. మొహ్సిన్ ఎడమ చేతి కోణం, బ్యాట్స్‌మన్‌ని ఆశ్చర్యపరిచే అతని బౌన్సర్ సామర్థ్యం అతిపెద్ద బలాలు. అతని భారీ బంతికి బౌండరీలు కొట్టడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టం. అతను తన ప్రదర్శనలో నిలకడగా ఉంటే, అతను త్వరలో భారత జట్టులో కనిపిస్తాడు.

సీమ్, స్వింగ్‌లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ముఖేష్ చౌదరి..

దీపక్ చాహర్ గాయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ముఖేష్ చౌదరిని జట్టులోకి తీసుకున్నారు. తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీసిన ముఖేష్.. రానున్న కాలంలో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్‌గా టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకోవచ్చు. ముంబై ఇండియన్స్‌పై 46 పరుగులకు 4 కీలక వికెట్లు తీయడం ముఖేష్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్‌గా నిలిచింది. 2021-22 విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముఖేష్ నిలిచాడు. అతను పవర్‌ప్లే సమయంలో బంతిని సీమ్ చేయగలడు, అలాగే స్వింగ్ చేయగలడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి కలిసి చెన్నై ఫాస్ట్ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు. ఈ ఘోరమైన ఫాస్ట్ బౌలింగ్ కలయిక ప్రత్యర్థి జట్లను దెబ్బతీస్తుంది.

అద్భుతమైన లైన్ లెంగ్త్‌తో స్పీడ్ పెంచిన యశ్ దయాళ్..

గుజరాత్ టైటాన్స్ తన తొలి ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ ఆడింది. ఈ అద్భుతమైన విజయంలో యష్ దయాళ్ కీలక పాత్ర పోషించారు. 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసిన ఈ పేసర్ గుజరాత్‌కు కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. దాదాపు 147kmph వేగంతో డెక్‌ని నిలకడగా ఢీకొట్టే యష్ దయాల్, రాబోయే కాలంలో టీమ్ ఇండియా పేస్ బ్యాటరీలో ముఖ్యమైన భాగం కాగలడు. యశ్ దయాళ్‌కి ఇది తొలి IPL. 2021-22 విజయ్ హజారే ట్రోఫీలో టాప్-10 వికెట్లు తీసిన ఆటగాళ్లలో యశ్ దయాల్ కూడా ఉన్నాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల సత్తా అతనికి ఉంది. యష్ తన లక్ష్యాన్ని 150kmph స్పీడ్‌కి చేరుకోవాలని చెప్పుకొచ్చాడు. దయాల్ లైన్-లెంగ్త్‌లో తన పేస్‌ని నిర్వహించగలిగితే, ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ వెటరన్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలను సృష్టించగలడు.

పేస్‌తో వెటరన్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టే కుల్దీప్..

2008 తొలి సీజన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో కుల్దీప్ సేన్ ఫాస్ట్ బౌలింగ్ చాలా ముఖ్యమైనది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20 పరుగులకు నాలుగు వికెట్లు తీయడం, 7 మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు తీయడం కుల్దీప్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 145kmph వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగల కుల్దీప్, టీమ్ ఇండియాలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల కోసం అన్వేషణను ముగించగలడని భావిస్తున్నారు. 2012 నుంచి భారతదేశం నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కోసం నిరంతరం అన్వేషణలో ఉంది. ఆ అన్వేషణ కుల్దీప్ సేన్ మీద ముగిసే ఛాన్స్ ఉంది.