IND vs SL: ఐసీసీ కొత్త రూల్ మర్చిపోయిన అంపైర్.. కట్‌చేస్తే.. ఫలితం తేలని భారత్, లంక తొలి వన్డే.. అదేంటంటే?

Sri Lanka vs India 1st ODI: ఈ రోజుల్లో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్టు 2న జరిగింది. ఈ మ్యాచ్ టై అయింది. మ్యాచ్ టై అయినందున ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న తలెత్తెంది. దీనికి ముందు టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ కూడా టై అయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ లేకపోవడంపై ఇప్పుడు కొత్త వివాదం తలెత్తింది.

IND vs SL: ఐసీసీ కొత్త రూల్ మర్చిపోయిన అంపైర్.. కట్‌చేస్తే.. ఫలితం తేలని భారత్, లంక తొలి వన్డే.. అదేంటంటే?
Ind Vs Sl 1st Odi Result

Updated on: Aug 04, 2024 | 10:14 AM

Sri Lanka vs India 1st ODI: ఈ రోజుల్లో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్టు 2న జరిగింది. ఈ మ్యాచ్ టై అయింది. మ్యాచ్ టై అయినందున ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న తలెత్తెంది. దీనికి ముందు టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ కూడా టై అయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ లేకపోవడంపై ఇప్పుడు కొత్త వివాదం తలెత్తింది.

ఐసీసీ పాత నిబంధనల ప్రకారం, వన్డే మ్యాచ్‌లలో సూపర్ ఓవర్ ఆడించడం లేదు. ఐసీసీ ఈవెంట్ మ్యాచ్‌లలో సూపర్ ఓవర్లు కనిపిస్తుంటాయి. అయితే, ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో సూపర్ ఓవర్ జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఈ మ్యాచ్‌లో అంపైర్ కొత్త ఐసీసీ నిబంధనను మరచిపోయారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఇవి కూడా చదవండి

ICC కొత్త నిబంధన ఏమిటి?

16.3 కింద, మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లు పూర్తయిన తర్వాత స్కోరు సమానంగా ఉంటే, సూపర్ ఓవర్ ఆడించాలి. ఆ తర్వాత, సూపర్ ఓవర్ టై అయితే, అసాధారణ పరిస్థితులు తలెత్తితే తప్ప, విజేతను ప్రకటించరు. తదుపరి సూపర్ ఓవర్ ఆడించాలి. విజేతగా ప్రకటించడానికి అవసరమైన సూపర్ ఓవర్‌ను ఆడడం లేదా పూర్తి చేయడం సాధ్యం కాకపోతే, మ్యాచ్ టై అవుతుంది. గతేడాది డిసెంబర్‌లో ఐసీసీ ఈ నిబంధనను తీసుకొచ్చింది.

తొలి వన్డేలో ఇరు జట్లు స్కోర్లు సమం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కూడా 230 పరుగులకు ఆలౌటైంది. అయితే ఒకప్పుడు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సులువుగా గెలుస్తుందని అనిపించింది. కానీ, అర్ష్‌దీప్‌ సింగ్‌ తప్పిదంతో ఆఖరికి టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ ఉంటుందని అందరూ భావించినా అది కుదరలేదు. ఇప్పుడు ఇరు జట్ల మధ్య తదుపరి వన్డే ఆగస్టు 4న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..