IND vs SA: సిరీస్ గెలిచేనా.. సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్‌కు సిద్ధమైన భారత్.. ప్లేయింగ్ 11లో 2 మార్పులు?
India vs South Africa 4th T20I Probable Indian Playing 11: టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికాలో సిరీస్ గెలిచేందుకు సిద్ధంగా ఉంది. చివరి మ్యాచ్‌లో విజయం సాధించాలని సూర్య సేన ఉరకలు వేస్తోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో అగ్రస్థానంలో నిలిచింది.
India vs South Africa 4th T20I Probable Indian Playing 11: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ చాలా ఉత్తేజకరమైన మలుపు తీసుకుంది. మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు నాలుగో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. అదే సమయంలో, ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్ద మార్పు ఉండవచ్చు అని తెలుస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు భారత్‌కు ఓపెనర్‌గా నిలిచారు. ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన మిశ్రమంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అపజయం పాలైన అభిషేక్ శర్మ మూడో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. కాగా, తొలి మ్యాచ్‌లో తుఫాన్ సెంచరీ చేసిన సంజూ శాంసన్ తర్వాతి రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా ఖాతా తెరవలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఓపెనర్లలో ఒకరిని తప్పించి, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మకు అవకాశం ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.
సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం వస్తుందా?
#TeamIndia emerge victorious in a high-scoring thriller in Centurion 🙌
They take a 2⃣-1⃣ lead in the series with one final T20I remaining in the series 👏👏
Scorecard – https://t.co/JBwOUChxmG#SAvIND pic.twitter.com/StmJiqhI7q
— BCCI (@BCCI) November 13, 2024
జితేష్ శర్మ అద్భుతమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయితే ఈ సిరీస్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని కూడా ప్రయత్నించాలని కోరుకుంటుంది. నాలుగో మ్యాచ్‌లో జితేష్‌కు అవకాశం ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కావడంతో సంజూ శాంసన్‌ను తప్పించి జితేష్‌ను ఆడించే అవకాశం ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి చోటు కల్పించాలని ప్రయత్నిస్తే మాత్రమే శాంసన్‌ని తప్పించే అవకాశం ఉంది.
ఇది కాకుండా, మిగిలిన జట్టు కూడా అలాగే ఉండవచ్చు. అయితే, రింకూ సింగ్ ఫామ్‌పై ఖచ్చితంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, అతను ఇంకా తన సత్తాకు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి టీమిండియా మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. బౌలింగ్‌లో కూడా మార్పు రావొచ్చు. రవి బిష్ణోయ్‌కి విశ్రాంతి ఇవ్వడం ద్వారా విజయ్‌కుమార్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. అతనికి కూడా ఈ సిరీస్‌లో ఇంకా అవకాశం రాలేదు.
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కి భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
అభిషేక్ శర్మ, జితేష్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాక్ష్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..