వైట్-బాల్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ సాధించిన విజయం క్రికెట్‌లో కొన్ని కొత్త ప్రయోగాల గురించి చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ చర్చలో వైట్, రెడ్ బాల్ క్రికెట్‌లో పూర్తిగా భిన్నమైన జట్లను ఎంచుకోవడం గురించి నడుస్తోంది. 2019లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వైట్ బాల్‌తో ఆడిన ఈ రెండు ఫార్మాట్‌లలో ఇంగ్లాండ్ విజయానికి ప్రధాన కారణం ఈ ఫార్మాట్‌లోని జట్లను టెస్ట్ జట్టు నుంచి పూర్తిగా వేరుగా ఉంచడమేనని అంటున్నారు. నిజానికి, ఇంగ్లండ్ చాలా సంవత్సరాల క్రితమే తెలుపు, ఎరుపు రంగు బంతితో ఆడే క్రికెట్‌లో ప్రత్యేక జట్టుతో కెప్టెన్లలోనూ మార్పులను చేస్తోంది. పరిస్థితికి తగ్గట్టుగానే మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు కొందరే ఉంటారు. మిగతా ఆటగాళ్లకు ఇంగ్లండ్‌లో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.
ఇంగ్లండ్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు మిగతా జట్లలోనూ ఈ నిబంధనను ప్రవేశపెట్టాలనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేను ప్రశ్నించగా.. వైట్, రెడ్ బాల్ క్రికెట్‌లో కచ్చితంగా ప్రత్యేక జట్లు ఉండాలని కూడా స్పష్టంగా చెబుతున్నాడు.
అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ‘కచ్చితంగా జట్లు భిన్నంగా ఉండాలి. టీ20 క్రికెట్‌లో కచ్చితంగా టీ20 స్పెషలిస్ట్ క్రికెటర్లు కావాలి. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు అవసరమని ఇంగ్లండ్ జట్టు ఈసారి నిరూపించిందని, ఆస్ట్రేలియా చివరిసారి నిరూపించిందని నేను భావిస్తున్నాను. ఆ టీంల బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే, ఇట్టే తెలిసిపోతుంది. ఇంగ్లండ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఏడవ స్థానంలో లివింగ్‌స్టోన్ సామర్థ్యం ఉన్న ఆటగాడు మరే ఇతర జట్టుకు ఉండదు’ అని చెప్పుకొచ్చాడు.
కుంబ్లే మాట్లాడుతూ, ‘ఆస్ట్రేలియాలో మార్కస్ స్టోయినిస్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇలాంటి టీమ్‌ని తయారు చేసుకోవాలి. వేరే కెప్టెన్, కోచ్ అవసరమా అని నాకు ఖచ్చితంగా తెలియదు. ఎలాంటి జట్టును ఎంచుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. తదనుగుణంగా నాయకత్వంతోపాటు సిబ్బంది వంటి విషయాలను నిర్ణయించుకోవచ్చు’ అని తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..