New Zealand: టీమిండియాతో సిరీస్‌ ముందే కివీస్ జట్టుకు ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు అవుట్..

|

Nov 15, 2022 | 1:23 PM

టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన తర్వాత అన్ని జట్లు సిరీస్‌ల మీద దృష్టి సారించాయి. అందులో భాగంగానే భారత్ గురువారం నుంచి న్యూజిలాండ్‌లో ఆ దేశ జట్టుతో తలపడనుంది. భారత్ తన పర్యటనలో..

New Zealand: టీమిండియాతో సిరీస్‌ ముందే కివీస్ జట్టుకు ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు అవుట్..
New Zealand Team
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన తర్వాత అన్ని జట్లు సిరీస్‌ల మీద దృష్టి సారించాయి. అందులో భాగంగానే భారత్ గురువారం నుంచి న్యూజిలాండ్‌లో ఆ దేశ జట్టుతో తలపడనుంది. భారత్ తన పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడబోతుంది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌తోనే వెనుదిరిగిన ఇరు జట్లు ఎలాగైనా ఈ సిరీస్‌లలో విజయం సాధించాలని.. ఐసీసీ టోర్నమెంట్ బాధ నుంచి బయటపడాలని యోచిస్తున్నాయి. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ముందే న్యుజిలాండ్ టీమ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆ జట్టులో కీలక ఆటగాళ్లు, సీనియర్లయిన ట్రెంట్ బోల్ట్, మార్టిన్ గప్టిల్‌ జట్టులో భాగం కాలేకపోయారు.

గప్టిల్‌ బదులుగా యువ ఆటగాడైన ఫిన్ ఆలెన్ జట్టులో స్థానం పొందాడు. ఇక బోల్ట్‌కు జట్టులో స్థానమే లేకపోయింది. అందుకు కారణం ఈ ఏడాది ప్రారంభంలో అతను.. అస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు వీలుగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తనను రిలీజ్ చేయమని బోల్ట్ స్వయంగా కోరుకోవడమే కారణమని వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ ఏడాది ఆగష్టులో బోల్ట్ తన కాంట్రాక్ట్ నుంచి రిలీజ్ చేయమని కోరుకున్నాడు. ఫలితంగా అతనికి ఇవ్వవలసిన ప్రియారిటీ సెంట్రల్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్టులను కలిగిన ఆటగాళ్లకు కల్పించడమయింది. అతని ఆట తీరు ఎలాంటిదనేది మా అందరికీ తెలుసు. కానీ అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింద’’ని న్యూజిలాండ్ కోచ్ గేరీ స్టీడ్ తెలిపారు.

కాగా,  భారత్‌తో తొలిసారి మ్యాచ్ ఆడబోతున్న ఫిన్ ఆలెన్.. ఇప్పటి వరకూ 23 టీ20లు, ఎనిమిది వన్డేలు ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో స్కాంట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగులు చేసిన అతడు.. టీ20 ప్రపంచకప్‌లో ఐదు ఇన్నింగ్‌లకు 95 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధిలా, సౌత్ సోధిలా, టిక్నర్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..