Team India: పవర్ ‘లెస్’ ప్లే నుంచి చెత్త బౌలింగ్ వరకు.. భారత్‌ను ఇంటిబాట పట్టించిన 5 కారణాలు ఇవే..

|

Nov 10, 2022 | 5:40 PM

T20 World Cup 2022: ఎన్నో ఆశలతో ఎదురుచూసిన భారత అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్‌పై చిత్తుగా ఓడిన భారత్.. రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టింది. టీమ్ ఇండియా ఓటమికి స్క్రిప్ట్ రాసిన ఆ 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Team India: పవర్ లెస్ ప్లే నుంచి చెత్త బౌలింగ్ వరకు.. భారత్‌ను ఇంటిబాట పట్టించిన 5 కారణాలు ఇవే..
India Vs England
Follow us on

India vs England: టీ20 ప్రపంచకప్‌ నుంచి టీమిండియా ఒంటి చేతులతో తిరిగి వస్తోంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఏకపక్షంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయి.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన భారత స్టార్లు ఈ కీలక మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశ పరిచారు. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన భారత అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్‌పై చిత్తుగా ఓడిన భారత్.. రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టింది. టీమ్ ఇండియా ఓటమికి స్క్రిప్ట్ రాసిన ఆ 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బిగ్ మ్యాచ్‌లో రాహుల్ మళ్లీ ఫ్లాప్..

పెద్ద జట్టుపై భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగింది. బంగ్లాదేశ్, జింబాబ్వేలపై రాహుల్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఫైనల్ చేరాల్సిన ఈ మ్యాచ్‌లో మాత్రం తొలి బంతికే ఫోర్ కొట్టి, ఊపులో కనిపించినా.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. అతను 5 బంతుల్లో 5 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధించలేకపోయింది. ఈ తేడా ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది.

బ్యాటింగ్ పవర్ ప్లేలో తుస్సుమన్న టీమిండియా..

టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేస్తానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కానీ, బరిలోకి దిగిన తర్వాత కూడా భారత బ్యాట్స్‌మెన్‌ల తీరు కాస్త భయంకరంగానే కనిపించింది. పవర్-ప్లే 6 ఓవర్లలో భారత్ కేవలం 1 వికెట్ కోల్పోయింది. కానీ, కేవలం 38 పరుగులు మాత్రమే చేయడంతో పరాజయానికి అడుగులు వేసింది. భారత్ 10 ఓవర్లలో కేవలం 62 పరుగులు మాత్రమే చేసి, చేతులెత్తేసింది.

ఇవి కూడా చదవండి

హార్దిక్ ఒక్కడే హిట్టింగ్.. తేలిపోయిన టీం..

నెమ్మదిగా ప్రారంభించిన భారత్‌కు చివరి ఓవర్లలో పవర్ హిట్టింగ్ అవసరమైంది. ఇందులో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా విజయం సాధించాడు. కానీ, ఈ విషయంలో అతను ఒక్కడే నిరూపించుకున్నాడు. దీనికి కారణం ఆయన తప్ప మరెవ్వరూ బ్యాట్ ఝలిపించలేకపోయారు. హార్దిక్ 190 స్ట్రైక్ రేట్ వద్ద బ్యాటింగ్ చేశాడు. అయితే,, కనీసం 15 బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్ ఎవరూ స్ట్రైక్ రేట్ 130 వద్ద కూడా పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 96 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 125 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. సూర్య మంచి ఆరంభాన్ని అందించాడు. కానీ, అతను 10 బంతులు ఆడిన తర్వాత అతను ఔటయ్యాడు. రిషబ్ పంత్ కూడా 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

బౌలింగ్‌లో తేలిపోయిన భారత్..

ఈ ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు ముందు భారత్ బాగా బౌలింగ్ చేసింది. ఆ మ్యాచుల్లో ఫాస్ట్ బౌలర్లు మంచి స్వింగ్ అందుకోవడమే ఇందుకు కారణం. ఈ మ్యాచ్‌లో స్వింగ్ కనిపించలేదు. ఫలితంగా భారత బౌలర్లు పూర్తిగా అసమర్థులుగా నిరూపించుకున్నారు. భువేశ్వర్, అర్ష్‌దీప్ మాత్రమే కాదు.. షమీ కూడా నిర్జీవంగా మారిపోయాడు. వికెట్లు తీయడంలో విఫలమైన భారత బౌలర్లను.. ఇంగ్లండ్ ఓపెనర్లు చావబాదారు.

బట్లర్-హేల్స్ బీభత్సం..

169 పరుగుల లక్ష్యం అనేది సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో సవాలుగా ఉండవచ్చు. కానీ, ఇంగ్లీష్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఏమాత్రం ఒత్తిడి లోనుకాకుండా, సరదాగా టార్గెట్ చేరుకున్నారు. తొలి ఓవర్‌ నుంచే ధాటిగా బ్యాటింగ్‌ చేసిన ఈ ఇద్దరూ.. భారత బౌలర్లను చావబాదారు. బట్లర్ 163 స్ట్రైక్ రేట్ వద్ద అజేయంగా 80, హేల్స్ 182 స్ట్రైక్ రేట్ వద్ద అజేయంగా 86 పరుగులతో నిలిచారు. మన బౌలర్ల ఖాతాలో ఒక్క వికెట్ కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..