Sixer King 2025: 2025లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరు? టాప్ 7లో మనోళ్లు ఒక్కరూ లేరా ?
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో టీ20 ఇంటర్నేషనల్‌లోనే ఎక్కువ సిక్సర్లు ఉంటాయి. ఇప్పుడు వన్డే, టెస్ట్ క్రికెట్‌లో కూడా బ్యాట్స్‌మెన్లు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో టెస్ట్‌లో ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Sixer King 2025: క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో టీ20 ఇంటర్నేషనల్‌లోనే ఎక్కువ సిక్సర్లు ఉంటాయి. ఇప్పుడు వన్డే, టెస్ట్ క్రికెట్‌లో కూడా బ్యాట్స్‌మెన్లు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో టెస్ట్‌లో ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, ఈ ఏడాది 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా? ఆ జాబితాలో భారత్ నుంచి రిషభ్ పంత్, అభిషేక్ శర్మ ఏ స్థానాల్లో ఉన్నారో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఆస్ట్రియా, బహ్రెయిన్, కేమాన్ ఐలాండ్స్, స్కాట్లాండ్ వంటి దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో కేవలం పాకిస్తాన్‌కు చెందిన ఒక ఆటగాడు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
1. కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా): ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు కరణ్‌బీర్ సింగ్. అతను 24 మ్యాచ్‌లలో 2 సెంచరీలతో 1013 పరుగులు చేసి 74 సిక్సర్లు కొట్టాడు.
2. ఫయాజ్ అహ్మద్ (బహ్రెయిన్): ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫయాజ్ 29 మ్యాచ్‌లలో 943 పరుగులు చేసి 52 సిక్సర్లు కొట్టాడు.
3. బీలాల్ జల్మై (ఆస్ట్రియా): 28 మ్యాచ్‌లలో 43 సిక్సర్లు కొట్టి మూడో స్థానంలో ఉన్నాడు.
4. జర్మాయిన్ బేకర్ (కేమ్యాన్): ఈ ఏడాది ఇప్పటివరకు 37 సిక్సర్లు కొట్టాడు.
5. హెన్రీ జార్జ్ మున్సే (స్కాట్లాండ్): ఈ సంవత్సరం 36 సిక్సర్లు కొట్టి ఐదో స్థానంలో ఉన్నాడు.
6. ఆసిఫ్ అలీ (బహ్రెయిన్): ఈ ఏడాది 35 సిక్సర్లు కొట్టి ఆరో స్థానంలో ఉన్నాడు.
7. హసన్ నవాజ్ (పాకిస్థాన్): ఇతను ఐసీసీ సభ్య దేశాల జాబితాలో ఉన్న ఏకైక ఆటగాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 33 సిక్సర్లు కొట్టి ఏడో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ పూర్తి సభ్య దేశాల నుంచి టాప్ 7 ఆటగాళ్లు
ఐసీసీ సభ్య దేశాల ఆటగాళ్ల విషయానికొస్తే, టాప్ 7 లో భారత్ నుంచి ఎవరూ లేరు. భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ 9వ స్థానంలో, రిషభ్ పంత్ 10వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఈ ఏడాది ఇప్పటివరకు చెరో 22 సిక్సర్లు కొట్టారు.
1. హసన్ నవాజ్ (పాకిస్థాన్) – 33 సిక్సర్లు
2. షై హోప్ (వెస్టిండీస్) – 28 సిక్సర్లు
3. టిమ్ సెయిఫెర్ట్ (న్యూజిలాండ్) – 27 సిక్సర్లు
4. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 25 సిక్సర్లు
5. తన్జిద్ హసన్ (బంగ్లాదేశ్) – 24 సిక్సర్లు
6. జేమీ స్మిత్ (ఇంగ్లాండ్) – 24 సిక్సర్లు
7. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 23 సిక్సర్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




