T20 Blast: 37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

|

Jul 19, 2021 | 9:08 PM

క్రికెట్‌లో విజయాలు, ఓటములు సర్వసాధారణం. కానీ ఓ జట్టు తక్కువ సమయంలో మ్యాచ్‌ను కోల్పోవడం చాలా అరుదు. తాజాగా అలాంటి రసవత్తకరమైన..

T20 Blast: 37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!
Tom Lambony
Follow us on

క్రికెట్‌లో విజయాలు, ఓటములు సర్వసాధారణం. కానీ ఓ జట్టు తక్కువ సమయంలో మ్యాచ్‌ను కోల్పోవడం చాలా అరుదు. తాజాగా అలాంటి రసవత్తకరమైన మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో 21 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించాడు. 37 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించాడు. సోమర్సెట్, గ్లౌసెస్టర్షైర్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో సోమెర్‌సెట్ బ్యాట్స్‌మెన్ టామ్ లామోన్‌బీ తుఫాన్ ఇన్నింగ్స్ ప్రత్యర్ధి టీంను బెంబేలెత్తించింది.

స్కోరు బోర్డులో 50 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయినప్పుడు.. టామ్ లామోన్‌బీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రత్యర్ధి బౌలర్లు బౌన్సర్లతో విరుచుకుపడినా.. క్రీజులో అతుక్కుపోయాడు. డివిలియర్స్ స్థాయిలో వారిపై ఎదురుదాడికి దిగాడు. 37 నిమిషాల పాటు సాగిన బ్యాటింగ్‌లో సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు.

37 నిమిషాల్లో 36 బంతులను ఎదుర్కున్న టామ్.. 250 స్ట్రైక్ రేట్‌తో 90 పరుగులు చేశాడు, ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతడు దాదాపు 15 బంతుల్లో 453 స్ట్రైక్ రేట్‌తో 68 పరుగులు చేసినట్లు లెక్క. ఈ 21 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ చేసిన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సోమర్సెట్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. కాగా, టార్గెట్‌ను చేధించే క్రమంలో గ్లౌసెస్టర్షైర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో సోమర్సెట్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై బాదుడే బాదుడు.!