Worst Match of T20 : టీ 20 చెత్త మ్యాచ్ ఇదే..! 20 ఓవర్లలో కేవలం ఒకే ఫోర్.. క్రికెట్ చరిత్రలోనే దారుణమైన ఆట..

| Edited By: Phani CH

Jun 07, 2021 | 9:46 AM

Worst Match of T20 : టీ 20 కేవలం బ్యాట్స్‌మెన్ ఆట మాత్రమే అని.. ఇందులో బౌలర్లకు స్కోప్ లేదనేవారు ఈ మ్యాచ్

Worst Match of T20 : టీ 20 చెత్త మ్యాచ్ ఇదే..! 20 ఓవర్లలో కేవలం ఒకే ఫోర్.. క్రికెట్ చరిత్రలోనే దారుణమైన ఆట..
Worst Match Of T20
Follow us on

Worst Match of T20 : టీ 20 కేవలం బ్యాట్స్‌మెన్ ఆట మాత్రమే అని.. ఇందులో బౌలర్లకు స్కోప్ లేదనేవారు ఈ మ్యాచ్ చూడాలి. ఇది ఆఫ్రికన్ గడ్డపై జరిగింది. 20 ఓవర్లు ఆడిన ఒక జట్టు ఒక బౌండరీని మాత్రమే సాధించింది. 10 మంది బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేసి ఒక్క ఫోర్ మాత్రమే కొట్టారు. నైజీరియా ఉమెన్ వర్సెస్ నమీబియా మధ్య ఆడిన మహిళల టి 20 మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ రువాండా పిచ్‌లో జరిగింది. ఇందులో నైజీరియా జట్టు బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 52 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో జట్టు నుంచి ఒక బౌండరీ మాత్రమే వచ్చింది. ఆశ్చర్యకరంగా నైజీరియాకు చెందిన ప్రతి బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడటానికి చాలా కష్టపడుతున్నట్లు కనిపించింది. కానీ డబుల్ ఫిగర్ ను దాటడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు.

10 మంది బ్యాట్స్‌మెన్లు 20 ఓవర్లు, కేవలం ఒక బౌండరీ
నైజీరియా జట్టులో అతిపెద్ద స్కోరు 7 పరుగులు, ఆ జట్టు కెప్టెన్ చేసింది. ఆమెతో పాటు మరొకరు 7 పరుగులు చేశారు. ఇద్దరు బ్యాట్స్ మెన్ ఖాతా తెరవలేదు. మరో ఇద్దరు 3-3 పరుగులు సాధించారు. అదే సమయంలో మిగిలిన ఇద్దరు 2-2 పరుగులు చేశారు. కాగా ఒక బ్యాట్స్ మెన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6 పరుగులు చేసిన ఈ బ్యాట్స్‌మన్ ఖాతాలో ఒక బౌండరీ వచ్చింది. నైజీరియా బ్యాట్స్‌మెన్‌ల గణాంకాలను పరిశీలిస్తే అది స్కోరు బోర్డు కాదు ఒకరి మొబైల్ నంబర్ అనిపించింది. అదృష్టవశాత్తూ నమీబియా జట్టు అదనంగా వారికి 19 పరుగులు సమర్పించింది. ఈ కారణంగా స్కోరు బోర్డు 50 పరుగులు దాటింది.

4 ఓవర్లలో 4 వికెట్లు తీసిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
టీ 20 ను బ్యాట్స్ మెన్ ఆట అంటారు కానీ అది నిజం కాదు. ఈ మ్యాచ్‌లో 18 ఏళ్ల నమీబియా బౌలర్ విక్టోరియా హమునెలా 4 ఓవర్లలో 8 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. అయితే నమీబియా 53 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. 2 వికెట్లు కోల్పోయి కేవలం 56 బంతుల్లోనే ఈ పనిని పూర్తి చేశారు. 64 బంతుల్లో 8 వికెట్ల తేడాతో నమీబియా ఈ మ్యాచ్ గెలిచింది.

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము