World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

సాధారణం ఒక బంతికి 1 పరుగు లేదా రెండు పరుగులు.. ఇంకా లేకపోతే ఫోర్ లేదా సిక్స్ కొడతాం. అయితే ఇక్కడ ఓ జట్టు ఏకంగా ఒక బంతికే 21 పరుగులు చేసింది. మరి ఆ జట్టు ఏంటి.? ఆ మ్యాచ్ ఏంటి.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?
Cricket Bowler

Updated on: Jan 07, 2026 | 2:00 PM

2006లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా ఒకే బంతికి 21 పరుగులు నమోదయ్యాయి. 48వ ఓవర్‌లో రోజర్ టెలిమేకస్ వేసిన నాలుగు నో-బాల్స్, ఆ తర్వాత వచ్చిన లీగల్ బంతి ద్వారా మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ అద్భుత రికార్డుకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన సంఘటనలలో ఒకటి ఇది. 2006లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఒకే బంతికి 21 పరుగులు నమోదు కావడం విశేషం. ఇదొక రికార్డు అని చెప్పొచ్చు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 435 పరుగుల భారీ టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 48వ ఓవర్‌ మొదటి బంతికి ఈ అసాధారణ రికార్డు నమోదైంది. బౌలర్ రోజర్ టెలిమేకస్ తన మొదటి లీగల్ బంతిని వేసే ముందు నాలుగు నో-బాల్స్‌ను వేశాడు. మొదటి నో-బాల్‌కు రికీ పాంటింగ్ ఫోర్ కొట్టగా, రెండో నో-బాల్‌కు సింగిల్ తీశాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మూడో నో-బాల్‌కు ఆండ్రూ సైమండ్స్ ఫోర్ కొట్టగా, నాలుగో నో-బాల్‌కు సిక్సర్ కొట్టాడు. ఈ నాలుగు నో-బాల్స్ ద్వారానే 19 పరుగులు(బంతికి ఒక నో-బాల్ పరుగుతో సహా) వచ్చాయి. చివరకు, అదే ఓవర్లో టెలిమేకస్ వేసిన మొదటి లీగల్ బంతికి సైమండ్స్ మరో రెండు పరుగులు తీశాడు. దీంతో కేవలం ఒక లీగల్ బంతిని పూర్తి చేసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు బోర్డుపై 21 పరుగులు చేరాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడం, దక్షిణాఫ్రికా అద్బుతమైన విజయాన్ని సాధించడంతో ఈ ప్రత్యేక రికార్డు ఎవరూ గుర్తించలేకపోయారు.

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి